Gaddar Awards :గద్దర్ అవార్డుల విధివిధానాలు ఖరారు.. జీవో జారీ
Gaddar Awards procedures finalized.. GO issued

గద్దర్ అవార్డుల విధివిధానాలు ఖరారు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ జీవో నెంబర్ 25 ను విడుదల చేసింది. తెలంగాణ సినిమా రంగానికి విశేష సేవలందించిన పైడి జయరాజ్, కాంతారావు, ఎం ప్రభాకర్ రెడ్డి పేర్లతో అవార్డులు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2014 నుండి 2023 వరకు అప్పటి తెలంగాణా ప్రభుత్వం చలన చిత్ర అవార్డులను ఇవ్వకపోవడంతో ఆ సంవత్సరాలకు కూడా ఒక్కో ఏడాదికి ఉత్తమ చలన చిత్రానికి అవార్డు నివ్వాలని నిర్ణయించారు. ఈనెల 13 నుంచి గద్దర్ అవార్డుల కోసం దరఖాస్తుల స్వీకరించనున్నారు. ఫీచర్ ఫిలిం కాటగిరిలో మొట్టమొదటి సారిగా ఉర్దూ భాషా చిత్రాలకు కూడా అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణ యించింది. ఫీచర్ ఫిల్మ్, జాతీయ సమైక్యత చిత్రం విభాగంలో గద్దర్ అవార్డులు ఇవ్వనున్నారు. అలాగే బాలల చలన చిత్రం విభాగం, పర్యావరణం, హెరిటేజ్ చరిత్రపై చిత్రాలకు గద్దర్ పురస్కారాలు అందజేయనున్నారు. తొలి ఫీచర్ ఫిల్మ్, యానిమేషన్ ఫిల్మ్ కేటగిరీలతో పాటు సోషల్ ఎఫెక్ట్ ఫిల్మ్, డాక్యుమెంటరీ ఫిల్మ్, షార్ట్ ఫిల్మ్ విభాగాల్లో అవార్డులు ఇవ్వనున్నారు.