Janasena :ఈనెల 14న జనసేన పార్టీ ఆవిర్భావ సభ.. భారీ ఏర్పాట్లు

జనసేన ఆవిర్బావ సంబరాలకు చిత్రాడ గ్రామం ముస్తాబవుతోంది. ఈనెల 14వ తేదీన జనసేన పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో 25 ఎకరాల ప్రాంగణంలో సభ నిర్వహించబోతున్నారు. జనసేన పార్టీ విజయోత్సవ సభలా ఆవిర్భావ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.కూటమి ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సభ ద్వారా పవన్ కళ్యాణ్ వివరించనున్నారు. సభలో భవిష్యత్తు కార్యచరణ, ఆర్దిక కార్యకలాపాలపై దిశా నిర్దేశం చేస్తారు. సభ అనంతరం పరిసరాల శుభ్రం చేసే బాధ్యత తీసుకుంటామని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సారధిలో 25 మంది స్థానిక నాయకులతో కమిటీ ఏర్పాటు చేశారు.పార్టీ పీఏసీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్ని తానై సభ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కాకినాడలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.14వ తేదీన సాయంత్రం నాలుగు గంటల నుండి 5 గంటలపాటు సభ కొనసాగనుంది. మన సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించబోతున్నారు. లక్షల సంఖ్యలో జనసేన కార్యకర్తలు, అభిమానులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. సభ అనంతరం తిరుగు ప్రయాణంలో నాలుగు ముఖ్య రహదారుల్లో భోజనశాలలు ఏర్పాటు చేశారు. అలాగే సభలో యువత, రైతులు, మహిళా ప్రతినిధులకు మాట్లాడే అవకాశం ఇస్తున్నారు.