డ్రైనేజీపై ర్యాంప్ నిర్మాణం వివాదం.. మచిలీపట్నం వైసీపీ ఆఫీసు దగ్గర పోలీసులు
Ramp construction controversy on drainage.. Police near Machilipatnam YCP office
By P.Rajesh
On

కృష్ణాజిల్లా మచిలీపట్నం వైసీపీ జిల్లా కార్యాలయం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. డ్రైనేజీపై ర్యాంప్ నిర్మాణం వివాదాస్పదంగా మారడంతో భారీగా పోలీసులు మోహరించారు. స్టేటస్ కో ఉన్న వైసీపీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో నిన్న రాత్రి వైసీపీ కార్యాలయానికి వెళ్లే డ్రైనేజీపై ర్యాంప్ నిర్మాణం చేపట్టారు ఆ పార్టీ నేతలు.
విషయం తెలుసుకుని అనుమతులు లేకుండా నిర్మించిన ర్యాంప్ ను మున్సిపల్ అధికారులు తొలగించారు. దీంతో పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు వచ్చే అవకాశం ఉండడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పార్టీ కార్యాలయానికి వెళ్లే రోడ్డును, స్టాపర్లను మూసివేశారు.
Views: 5
Latest News
13 Mar 2025 06:24:34
నడక లేదా యోగా ఏది చేస్తే బరువు తగ్గుతారో తెలుసా?
ప్రస్తుత మారుతున్న జీవనశైలి, పొల్యూషన్, తిండి అలవాట్ల కారణంగా జీవితంలో ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండటం సవాల్‌తో...