గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించారు- పాయల్ శంకర్
Lies were told by the Governor - Payal Shankar
By P.Rajesh
On

గవర్నర్ జిష్ణుదేవ్ నోట ప్రభుత్వం పూర్తిగా అబద్ధాలు చెప్పించిందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. రైతు రుణమాఫీ ఇంకా పూర్తి కాకుండానే పూర్తి చేసినట్లు గవర్నర్ తో మాట్లాడించారని ఆరోపించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేశామని గవర్నర్ ప్రసంగం లో చెప్పారని.. ఏ మహిళను కోటీశ్వరులుగా చేశారో వాళ్ళనే అడుగుదామని అన్నారు పాయల్ శంకర్. రాష్ట్రంలో భూగర్భ జలాలు అడుగంటి.. పంటలు ఎండుతున్నా..రైతులను ఎలా ఆదుకుంటారో చెప్పలేదన్నారు. చేయని పనులు చేసినట్లు అబద్ధాలను గవర్నర్ తో చెప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తప్పులను గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం రోజున బీజేపీ ఎండగడుతుందని పాయల్ శంకర్ అన్నారు.
Views: 3
Related Posts
Latest News
13 Mar 2025 06:24:34
నడక లేదా యోగా ఏది చేస్తే బరువు తగ్గుతారో తెలుసా?
ప్రస్తుత మారుతున్న జీవనశైలి, పొల్యూషన్, తిండి అలవాట్ల కారణంగా జీవితంలో ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండటం సవాల్‌తో...