CM Chandrababu : తల్లికి, చెల్లికి వాటా ఇవ్వని వ్యక్తి సీఎంగా పనిచేశారు- చంద్రబాబు
A person who did not give a share to his mother and sister served as CM - Chandrababu

తల్లికి, చెల్లికి వాటా ఇవ్వని వ్యక్తి నిన్నటి వరకు సీఎంగా పనిచేశారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఇచ్చిన వాటా మీద కోర్టుకు వెళ్లారని ఆరోపించారు. మహిళల గురించి మాట్లాడే హక్కు జగన్‌కు లేదన్నారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తే.. తల్లి, చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వలేదని చంద్రబాబు విమర్శించారు. మహిళా సాధికారిత అంశంపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా సాధికారత టీడీపీతోనే ప్రారంభమైందని చెప్పారు. 1986లో ఎన్టీఆర్ మహిళలకు సమాన ఆస్తి హక్కు ఇచ్చారని.. మహిళలకు 33శాతం రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల బాగా చదువుకున్నారని చెప్పారు. మహిళా సాధికారతపై మాటల్లో చెప్పడం కాదు..చేతల్లో చేసి చూపించాలని అన్నారు. డీలిమిటేషన్ పూర్తయితే 33 శాతం మంది మహిళలు చట్టసభలో ఉంటారని చంద్రబాబు సభలో అన్నారు. సమాజంలో ఇంకా మార్పు రావాల్సి ఉందన్నారు చంద్రబాబు.