Teenmar Mallanna:కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెన్షన్
Teenmar Mallanna suspended from Congress party

కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెన్షన్
హైదరాబాద్, సూర్య టుడే :తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. బీసీ కులగణన నివేదికను కాల్చివేయడంపై క్రమశిక్షణా కమిటీ నోటీసులు ఇచ్చింది. తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని గడువు ఇచ్చింది. అయితే గడువు దాటినా తీన్మార్ మల్లన్న స్పందించకపోవడంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మల్లన్న సస్పెన్షన్ పై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందించారు. పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మల్లన్నను ఎన్నో సార్లు హెచ్చరించామని.. బీసీ కులగణన ప్రతులు చించడంపై ఏఐసీసీ సీరియస్ అయిందని చెప్పారు. మల్లన్న చేసిన వాఖ్యలు చాలా తప్పని అన్నారు. పార్టీ గీత దాటితే ఎవరినైనా వదిలిపెట్టమని హెచ్చరించారు.