YS Jagan:మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీయే- జగన్
YSRCP will come to power again - Jagan

మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీయే- జగన్
వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని.. మళ్లీ మనమే అధికారంలోకి వస్తామని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఇవాళ వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. వైసీపీ ఆవిర్భవించి 14 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇవాళ 15వ వసంతంలోకి అడుగుపెట్టింది. కానీ ఈ ఏడాది కేవలం పార్టీ జెండా ఆవిష్కరణకు మాత్రమే పరిమితమయ్యారు. ఇదే సమయంలో నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలపై పోరుబాటకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్.. ప్రతిపక్షంలో కూర్చోవడం తమకు కొత్త కాదని.,. ప్రజల తరపున వైసీపీ పోరాటం చేస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు. విద్యార్థులకు ఇప్పటి వరకు ఫీజు రీఎంబర్స్‌మెంట్ చెల్లించలేదని అన్నారు. గత వైసీపీ పాలనలో అన్ని వర్గాలను అక్కున చేర్చుకున్నామన్నారు జగన్