ప్రొద్దుటూరులో ఫ్లోరెన్స్ ఆస్పత్రి సీజ్
Florence Hospital siege in Proddatur
By P.Rajesh
On

కడపజిల్లా ప్రొద్దుటూరులో వైద్యశాఖ అధికారులు దాడులు చేశారు. వైద్యశాఖ అనుమతులు లేకుండా కాన్పులు, అబార్షన్లు చేస్తున్న ఫ్లోరెన్స్ ఆసుపత్రిని సీజ్ చేశారు. విజయనగరం వీధిలో ఉన్న ఫ్లోరెన్స్ ఆసుపత్రిలో అనుమతులు లేని వైద్యం చేస్తున్నారని బాధితులు కడప వైద్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు రంగంలోకి దిగారు. వారి ఫిర్యాదు మేరకు డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓ శివప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో అధికారులు ఫ్లోరెన్స్ ఆసుపత్రిని తనిఖీ చేసి, ఆపరేషన్ థియేటర్, పరికరాలను సీజ్ చేశారు. జిల్లా వైద్యశాఖ అధికారుల ఆదేశాల మేరకు తాము ఈ చర్యలు తీసుకున్నామని చెప్పారు.
Views: 36
Related Posts
Latest News
13 Mar 2025 06:24:34
నడక లేదా యోగా ఏది చేస్తే బరువు తగ్గుతారో తెలుసా?
ప్రస్తుత మారుతున్న జీవనశైలి, పొల్యూషన్, తిండి అలవాట్ల కారణంగా జీవితంలో ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండటం సవాల్‌తో...