dangeres-virus-congress: కరోనా కన్నా డేంజరెస్ వైరస్ కాంగ్రెస్ ..ఎక్స్‌లో కేటీఆర్
Congress is a more dangerous virus than Corona...KTR in X

ముఖ్యమంత్రి రాసుకునే “చీకటి చరిత్ర”ఇదేనా..?
Is this the "dark history" that the Chief Minister is writing?
హైదరాబాద్ - సూర్య టుడే:కరోనా కన్నా డేంజరెస్ వైరస్ కాంగ్రెస్ అంటూ కేటీఆర్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. ఏడాది క్రితం చెప్పింది ఇవాళ అక్షరాలా నిజమైందని అన్నారు. అసమర్థ సీఎం ఆర్థిక వృద్ధికి గొయ్యితీసి పాతరేశారని కామెంట్ చేశారు. దేశంలోనే అగ్రభాగాన ఉన్న తెలంగాణను ఆఖరికి పడేశారని దుయ్యబట్టారు. గతేడాది 10 శాతం నమోదైన జీఎస్టీ వసూళ్లు.. కేవలం ఒకే ఒక్కశాతం వృద్ధికి పడిపోవడం సిగ్గుచేటని విమర్శించారు. చెత్త నిర్ణయాలతోనే తెలంగాణ ఆర్థికరంగంలో ఈ విధ్వంసం చోటుచేసుకుందని ఆరోపించారు. మతిలేని ముఖ్యమంత్రి ఘోర తప్పిదాల వల్లే ఈ సంక్షోభం తలెత్తిందని అన్నారు. ప్రభుత్వ పెద్దల కమీషన్లు ఆకాశాన్ని అంటుతుంటే.. రాష్ట్ర రాబడులు మాత్రం కుప్పకూలడం క్షమించరాని నేరం. కేసిఆర్ పదేళ్ల స్వర్ణయుగాన్ని చెరిపేసి..ముఖ్యమంత్రి రాసుకునే “చీకటి చరిత్ర”ఇదేనా..?.. అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.