పందుల స్వైర విహారం
ఆందోళనలో జనం,పరిసరాలు అపరిశుభ్రం చేస్తున్నాయని ఆవేదన మున్సిపల్ అధికారులు పట్టించుకోవాలని వేడుకోలు.

తుర్కయంజాల్ -సూర్య టుడే:తుర్కయంజాల్ మున్సిపల్ లోపందులు స్వైర విహారం చేస్తున్నాయి. నిత్యం పందులు పంది పిల్లలతో కలిసి రోడ్లపై తిరుగాడుతున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు పందులు రోడ్లపై, జన నివాసాల చుట్టూ సంచరిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇంటి పెరటిలో ఉన్న ఆకుకూరలు, పూల మొక్కలను పాడుచేస్తూ పరిసరాలను ఆశుభ్రపరుస్తున్నాయి. వీటి చేష్టలతో మహిళలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. పందుల సంచారం కారణంగా పిల్లలకు మెదడువాపు వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే పందులు విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతుండడంతో ద్విచక్ర వాహనదారులు పలుసార్లు ప్రమాదాలు బారిన పడుతున్నారు. పందులు రోడ్లపై పరుగులు తీస్తూ ద్విచక్ర వాహనాలకు అడ్డుగా రావడంతో వాహన దారులు ప్రమాదాలు బారిన పడుతూ క్షతగాత్రులుగా మారుతు న్నారు.
పందులు యథేచ్ఛగా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ జనం గగ్గోలు పెడుతున్నారు. ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ నిమ్మకు నీరేత్తిన్నట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు విమర్శలు చేస్తున్నారు.వీటి వల్ల డెంగ్యూ, ఇతరాత్ర వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి పందుల బెదద నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.