నేను సీనియర్‌ని.. నాకు ఎలా మాట్లాడాలో తెలుసు : Mla Danam Nagender Aggressive Speech In Assembly
నాకు ఎవరి సలహాలు అవసరం లేదు

హైదరాబాద్: తాను సీనియర్ ఎమ్మెల్యేని, తనకి ఏం మాట్లాడాలో తెలుసు. ఏం మాట్లాడాలో తనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. అనేక సందర్భాల్లో క్యాంపు ఆఫీస్‌కు స్థలం కావాలని విజ్ఞప్తి చేశానని.. తన విజ్ఞప్తి పక్కన పెట్టి వేరే వేరే ఆఫీస్‌కు శంకుస్థాపన చేశారని అన్నారు. అందుకే శిలాఫలకం కూలగొట్టిన్నట్లు తెలిపారు. ఈడబ్ల్యూఎస్ కాలనీలో అక్రమ నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. దీనిపై జీహెచ్‌ఎంసీ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ పట్టించుకోవటం లేదని అన్నారు. సోషల్ మీడియాకు భయపడి వెంటనే రెస్పాండ్ అయ్యే అధికారులు ఎమ్మెల్యే ఫిర్యాదుకు స్పందించటం లేదని సభలో ఎమ్మెల్యే పేర్కొన్నారు. ‘నాకు సంబంధించి.. నా క్యాంప్ ఆఫీసు గురించి గత పదిహేను నెలల నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను. మేము అడిగిన క్యాంప్ ఆఫీసు గురించి రెవెన్యూ డిపార్ట్‌మెంట్ వద్ద సమాచారం లేదని తెలిపారు. ఇది ఆశ్చర్యకరమే. మా నియోజకవర్గం రోడ్ నెంబర్ 10లో ఈద్గా గ్రౌండ్ ఉందని.. ఆ గ్రౌండ్ ఒక సబ్‌స్టేషన్ గురించి ల్యాండ్ అలాట్‌మెంట్ ఇచ్చారని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు రంజాన్ నడుస్తోంది. ఈద్గా గ్రౌండ్‌లో నాకు క్యాంప్ ఆఫీసుకు స్థలం ఇవ్వమంటే ఐడెంటిఫై చేయలేకపోయారు. సబ్ స్టేషన్‌కు నా ప్రమేయం లేకుండానే శంకుస్థాపన చేశారన్నారు. నా రెగ్యులర్ స్టైల్‌లో శిలాఫలకాన్ని పలగొట్టాను’ అని అన్నారు. ‘నేను మంత్రిగా ఉన్నప్పుడు శంకుస్థాన చేసి ఈడబ్ల్యూఎస్ కాలనీ కట్టించానని, కానీ ఆ కాలనీలో ఓ వ్యక్తి.. కొందరికి డబ్బులు ఇచ్చి అక్కడి ఇళ్లను లాక్కున్నాడన్నారు. దాదాపు ఆరు ఫ్లోర్లతో ఇళ్లు కట్టాడని.. ఈ విషయంపై జోనల్ కమిషన్‌కు ఫిర్యాదు చేశాను. ఎమ్మార్వో, తహశీల్దార్, డీసీకి విషయాన్ని తెలియజేశాను. అయినప్పటికీ యాక్షన్ తీసుకోలేదు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చాను.. ఇది నా బాధ్యత’ అని ఎమ్మెల్యే దానం నాగేందర్ వెల్లడిరచారు.