Crime News:కిలాడీ లేడీ అరెస్టు
విచారణలో బయటపడ్డ ఘోరాలు
1.jpg)
వరంగల్: కిలాడీ లేడీని పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి, డ్రగ్స్ మత్తులో ఆ లేడీ చేసిన అరాచకాలకు పోలీసులే అవాక్కయ్యారు. కొద్ది రోజుల క్రితం ఓ మైనర్ బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులకు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వరంగల్‌లో ఓ కిలేడీ అరాచకాలు ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తున్నాయి. అమాయక ఆడపిల్లలే లక్ష్యంగా ఆమె చేసిన ఘోరాలు సినీ స్టోరీని తలపిస్తున్నాయి. మత్తు మందులకు అలవాటు పడి ముఠాగా ఏర్పడిన వారంతా చేసిన అకృత్యాలు పోలీసులనే అవాక్కయ్యేలా చేస్తున్నాయి. వారు చేసిన దారుణాలు తెలుసుకుంటే ఆడపిల్లలను పాఠశాలలకు పంపాలంటేనే భయం వేస్తుంది. హనుమకొండ జిల్లా దామెర మండలానికి చెందిన ఓ కిలాడీ లేడీ కొంతకాలంగా వరంగల్ మిల్స్ కాలనీలో నివాసం ఉంటోంది. డ్రగ్స్‌కు బానిసైన ఆ లేడీ తనతోపాటు డ్రగ్స్‌కు అలవాటు పడిన ఓ అమ్మాయి, నలుగురు యువకులతో కలిసి ముఠా ఏర్పడిరది. సోషల్ మీడియాలో అట్రాక్షన్ కోసం ఫోటోలతో పాటు వీడియోలు పెడుతూ పలువురుని ఈ ముఠా తమ వైపుకు తిప్పుకుంది. మైనర్ బాలికలే లక్ష్యంగా ఈ కిలాడీ లేడీ వరంగల్‌లోని సంపన్నుల కాలనీలు, కార్పొరేట్ పాఠశాలల వద్ద రెక్కీ నిర్వహించేవారు. వరంగల్ పరిధిలో పాఠశాలకు వెళ్లి వచ్చే సమయంలో ఎంపిక చేసుకున్న బాలికలతో మాటలు కలిపి.. వారికి దగ్గరవుతూ ఆ అమ్మాయిలను యువకులకు ఎరగా వేసి.. వచ్చే డబ్బులతో ఈ ముఠా జల్సాలు చేస్తున్నారు. అయితే కిలాడీ లేడీకి డబ్బులు ఇచ్చే మానవ మృగాలు బాలికలు మత్తులో ఉండగా వారిపై అత్యాచారాలు చేసేవారు. బాలికలు పూర్తిగా స్పృహలోకి రాగానే కిలాడీ లేడీ గ్యాంగ్ వారిని ఎక్కడి నుంచి తీసుకువచ్చారో అక్కడే వదిలేసి వెళతారు. ఈ ముఠా దాదాపు ఏడాదిన్నరగా ఇలాంటి పనులు చేస్తూ.. బాలికల జీవితాలను నాశనం చేసింది. కిడ్నాప్ చేసిన బాలికలను ఉమ్మడి వరంగల్ జిల్లాల్లోని పలు ప్రాంతాలతోపాటు పక్క జిల్లాలకు కూడా తరలించినట్లు సమాచారం. అయితే వరంగల్ మిల్స్ కాలనీ పోలీస స్టేషన్ పరిధిలో మూడు రోజుల క్రితం ఓ బాలిక మిస్సింగ్‌తో ఆమె తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఇంటికి చేరుకున్న బాలికను ఆరా తీయగా తనను ఓ మహిళ కిడ్నాప్ చేసి తీసుకువెళ్లిందని, ఆ తర్వాత తనకు ఏం జరిగిందో తెలియదని, స్పృహలోకి వచ్చాక వదిలేసి వెళ్లారని చెప్పింది. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమెకు డ్రగ్స్ ఇచ్నిట్లు తేలినట్లు సమాచారం. ఆమెతోపాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో దర్యాప్తు చేసిన తమకు ఎన్నో సంచలన విషయాలు వెలుగుచూశాయని పోలీసులు చెబుతున్నారు.