Betting Apps:బెట్టింగ్ ఇన్‌ఫ్లూయెన్సర్లపై విచారణ చేసి చర్యలు తీసుకుంటాం : డీసీపీ విజయ్‌కుమార్

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రిటీలు, యూట్యూబ్ ఇన్‌ఫ్యూయెన్సర్లపై బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంతో హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. విష్ణుప్రియ, సుప్రీత, ఇమ్రాన్ ఖాన్ (పరేషన్ బాయ్స్), హర్ష సాయి, రీతూ చౌదరి, టేస్టీ తేజతో సహా మొత్తం 11 మందిపై క్రిమినల్ కేసులు పెట్టారు. కాగా, దీనిపై వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తాజాగా మీడియా సమావేశం నిర్వహించి సంచలన విషయాలు వెల్లడిరచారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. ‘‘బెట్టింగ్ యాప్స్‌పై ఓ సిటిజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. నిందితుల సోషల్ మీడియా అకౌంట్లను తనిఖీ చేస్తున్నాం. ఏఏ యాప్స్ ప్రమోట్ చేశారు, ఎలాంటి వీడియోలు పెట్టారనే అంశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. ముందుగా ఆధారాలను సేకరించి అనంతరం వారిపై తదుపరి చర్యలు తీసుకుంటాం. వీరంతా బెట్టింగ్ యాప్స్ ద్వారా అధికంగా డబ్బులు సంపాదించవచ్చంటూ నిరుద్యోగ యువతకు ఆశ చూపుతున్నారు. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ఎవరూ ప్రమోట్ చేయవద్దు. ఇమ్రాన్ ఖాన్ అనే యూట్యూబర్ విలువలు లేకుండా గలీజ్ వీడియోలు చేస్తున్నాడు. తన వీడియోల కోసం చిన్నపిల్లలనూ వాడుకుంటున్నాడు. ఇమ్రాన్ లాంటి వ్యక్తులపై నిఘా పెం చాం. ఎవరైనా యువతను తప్పుదోవ పట్టించే విధంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి అమాయకుల జీవితాలతో ఆడుకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం. .
......................................................................