MLA Balu Naik :మంత్రి పదవి రేసులో నేను ఉన్నా : ఎమ్మెల్యే బాలు నాయక్‌

On
MLA Balu Naik :మంత్రి పదవి రేసులో నేను ఉన్నా : ఎమ్మెల్యే బాలు నాయక్‌


హైదరాబాద్‌: మంత్రి పదవిపై దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్‌ నోరు విప్పారు. తాను కూడా మంత్రి పదవికి పోటీలో ఉన్నానని బాలు నాయక్‌ పేర్కొన్నారు. అసెంబ్లీ లాబీలో బాలు నాయక్‌ మీడియాతో చిట్‌చాట్‌ చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డి కేబినెట్‌లో ఇప్పటి వరకు తమ సామాజిక వర్గానికి చోటు లభించలేదని తెలిపారు. కాంగ్రెస్‌ ఏర్పడి 15 నెలలు గడుస్తున్నా కేబినెట్‌లో మా వాళ్లు లేరు అనే అసంతృప్తితో తమ సామాజికవర్గం వారు ఉన్నారన్నారు. కేసీఆర్‌ హయంలో మా సామాజిక వర్గానికి కేబినెట్‌లో స్థానం లభించిందని అన్నారు. తమ సామాజిక వర్గానికి కేసీఆర్‌ ఎక్కడా అన్యాయం చేయలేదు.. అయినా కాంగ్రెస్‌ పార్టీకి లంబాడీలు ఓట్లు వేశారు అని బాలు నాయక్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో ఇప్పటి వరకు లంబాడీలకు మంత్రి పదవి దక్కలేదన్నారు. అధిష్టానం, సీఎం రేవంత్‌ మంత్రి పదవి విషయంలో సానుకూలంగా ఉన్నారని,మా సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. నేను కూడా పోటీలో ఉన్నా. నాకు డిప్యూటీ స్పీకర్‌, మావాళ్లకు ఇంకో ఏదో పదవి ఇస్తే కాదు.. కేబినెట్‌లో బెర్త్‌ కావాలని డిమాండ్‌ ఉంది. మైదాన ప్రాంతాలకు చెందిన ఏ గిరిజన నాయకుడికి కూడా మంత్రి పదవి దక్కలేదు అని బాలు నాయక్‌ తెలిపారు.

Views: 187

Latest News