Election Commission:ఓటరు కార్డుతో ఆధార్‌ అనుంధానం

అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం కీలక భేటీ

On
Election Commission:ఓటరు కార్డుతో ఆధార్‌ అనుంధానం

న్యూ ఢిల్లీ:  ఓటరు జాబితాల తయారీలో అక్రమాలు జరిగాయంటూ విపక్షాలు తీవ్రస్ధాయితో విమర్శిస్తున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఆధార్‌తో ఓటరు కార్డు అనుసంధానంపై కీలక ప్రకటన చేసింది. ఆర్టికల్‌ 326, ప్రజాప్రాతినిధ్య చట్టం-1950, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఈ అనుసంధాన పక్రియ చేపట్టనున్నట్లు- తెలిపింది.  ఇందుకోసం యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ- ఆఫ్‌ ఇండియా, ఈసీ సాంకేతిక నిపుణుల మధ్య త్వరలోనే చర్చలు ప్రారంభం అవుతాయని ఓ ప్రకటనలో పేర్కొంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌, కమిషనర్లు సుఖ్‌బిర్‌ సింగ్‌ సందు, వివేక్‌ జోషీలు మంగళవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి, లెజిస్లేచర్‌ కార్యదర్శి, ఎలక్టాన్ర్రిక్స్‌, ఐటీ- శాఖ కార్యదర్శి, యూఐడీఏఐ సీఈవోతో పాటు- ఈసీ సాంకేతిక నిపుణులతో సమావేశమై చర్చించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 326 ప్రకారం.. భారతీయ పౌరులకు మాత్రమే ఓటు- హక్కు ఉంటు-ంది. అయితే, ఆధార్‌ కేవలం వ్యక్తి గుర్తింపును మాత్రమే నిర్ధారించగలిగే పత్రం. అందువల్ల ఓటర్ల  గుర్తింపు కార్డు ని ఆధార్‌తో అనుసంధానించడం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 326, ప్రజాప్రాతినిధ్య చట్టం-1950లోని సెక్షన్లు 23(4), 23(5), 23(6) నిబంధనలు, 2023లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా చేయాలని ఈ భేటీ-లో నిర్ణయించారు. ఇందులో భాగంగా యూఐడీఏ, ఈసీ -టె-క్నికల్‌ నిపుణుల మధ్య చర్చలు త్వరలోనే ప్రారంభం కానున్నాయని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది.

Views: 62

Latest News