సజ్జనార్ అవినీతిపై విచారణ జరిపించి మా ఉద్యోగాలను మాకు ఇవ్వండి-
Conduct an investigation into Sajjanar's corruption and give us our jobs

సజ్జనార్ అవినీతిపై విచారణ జరిపించి మా ఉద్యోగాలను మాకు ఇవ్వండి-
తొలగించిన ఆర్టీసీ కార్మికులుగత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తొలగించబడిన ఆర్టీసీ కార్మికుల ను తిరిగి విధులలోకి తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభ్యర్థించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు తమ గోడును వెళ్ళబోసుకున్నారు. చిన్న చిన్న తప్పులకే తమను విధుల నుండి తొలగించడం అన్యాయమని అన్నారు. దాదాపు రూ.1000 కోట్ల స్కాం కు టీజీఆర్టీసీ ఎండీ సజ్జనార్ పాల్పడ్డారని వారు ఆరోపించారు. మాజీ ఆర్టీసీ కార్మికుడు డుగ్గు రాజేందర్ మాట్లాడుతూ.. ఇప్పటికే అన్ని ఆధారాలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు విచారణ ఏజెన్సీలకు సైతం తాము ఫిర్యాదు చేయడం జరిగిందని.. దీనిపై సత్వరమే విచారణ జరిపి సజ్జనార్‌ను విధుల నుండి తొలగించాలని అభ్యర్థించారు. చిన్న ఉద్యోగులమైన తమను విధుల నుండి తొలగించి సజ్జనర్ తమ కుటుంబాలను రోడ్డుపాలు చేశారని వారు ఆరోపించారు. వెంటనే తమను తిరిగి విధులలోకి తీసుకొని తమకు న్యాయం చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.