Arun's Ice Cream:అరుణ్ ఐస్‌క్రీమ్ స్టోర్ ప్రారంభోత్సవం.
Arun's Ice Cream Store Opening Ceremony

తుర్కయంజాల్- సూర్య టుడే:తుర్కయంజాల్‌లో హాట్సన్ ఆగ్రో ప్రొడక్ట్ వారి అరుణ్ ఐస్‌క్రీమ్ స్టోర్‌ను బుధవారం స్టోర్ యజమాని ఎల్.శ్రీనివాస్ తో కలిసి పలువురు నాయకులు రిబ్బన్ కట్ చేసి, జ్యోతి ప్రజ్వలనతో షాపును ఓపెన్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వయం ఉపాధితో యువత ఆర్థిక ప్రగతి సాధించాలని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు.యువత స్వశక్తితో ఎదిగేందుకు ప్రాధాన్యమివ్వాలన్నారు. నాణ్యమైన ప్రొడక్టును సరసమైన ధరలకు అందించి ప్రజల మెప్పు పొందాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలోమున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షురాలుకొత్త కుర్మ మంగమ్మ శివ కుమార్, టి. పి. సి. సి సభ్యులు కాకుమాను సునీల్, మాజీ ఫ్లోర్ లీడర్ కోసికే ఐలయ్య,మేతరి దర్శన్ కాంగ్రెస్ నాయకులు పుల్లగుర్రం విజయానంద్‌రెడ్డి, గుండా భాగ్యమ్మ ధన్‌రాజ్, నాయకులు వస్పరి బాబయ్య, చెక్క రఘు, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.