KCR to Assembly:అసెంబ్లీ సమావేశాలకు కెసిఆర్‌ హాజరు

KCR attends assembly meetings

On
KCR to Assembly:అసెంబ్లీ సమావేశాలకు కెసిఆర్‌ హాజరు


అసెంబ్లీ సమావేశాలకు కెసిఆర్‌ హాజరు

హైదరాబాద్‌,మార్చి10:  ఈ అసెంబ్లీ సమావేశాలకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ హాజరవుతారని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరుగనున్నాయి. తొలిరోజు ఉభయసభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తారు. గవర్నర్‌ ప్రసంగానికి కెసిఆర్‌ హాజరవుతారని చెప్పారు. బడ్జెట్‌ ప్రసంగంలోనూ కేసీఆర్‌ పాల్గొంటారని వెల్లడిరచారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్‌ ఇవాళ నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్‌.. విూడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఎల్లుండి జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్‌ హాజరవుతారని తెలిపారు. తర్వాత కొన్ని కార్యక్రమాలకు కూడా కేసీఆర్‌ వస్తారని పేర్కొన్నారు. కానీ కేసీఆర్‌ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడమే మంచిదని ఒక కొడుకుగా తన అభిప్రాయమని చెప్పారు. కేసీఆర్‌ స్థాయికి కాంగ్రెస్‌లో ఎవరూ సరిపోరని అన్నారు. వాళ్ల పిచ్చి మాటలు, పనికిమాలిన దూషణలు, కారుకూతలు వినడానికి కేసీఆర్‌ రావద్దనేది కొడుకుగా తన అభిప్రాయమని వివరించారు.బీఆర్‌ఎస్‌ సభకు వరంగల్‌ అనువైన ప్రాంతమని కేటీఆర్‌ తెలిపారు. అన్ని రకాల రవాణా సదుపాయం ఉందని పేర్కొన్నారు. ప్లీనరీ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. దీనిపై బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేశారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున రెండు సభలు పెడితే ఇబ్బంది అని భావించామని తెలిపారు.

Views: 45

Latest News

Yoga vs Walking:నడక లేదా యోగా ఏది చేస్తే బరువు తగ్గుతారో తెలుసా? Yoga vs Walking:నడక లేదా యోగా ఏది చేస్తే బరువు తగ్గుతారో తెలుసా?
నడక లేదా యోగా ఏది చేస్తే బరువు తగ్గుతారో తెలుసా? ప్రస్తుత మారుతున్న జీవనశైలి, పొల్యూషన్, తిండి అలవాట్ల కారణంగా జీవితంలో ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండటం సవాల్‌తో...
TUWJ(IJU ):టీయూడబ్ల్యుజే (ఐజేయు) కమిటీని రద్దు చేయాలి
Mal Reddy Ram Reddy:జర్నలిస్టు శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర రోడ్డు డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి ఆర్ధికసాయం అందజేత
CM Chandrababu : తల్లికి, చెల్లికి వాటా ఇవ్వని వ్యక్తి సీఎంగా పనిచేశారు- చంద్రబాబు
గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించారు- పాయల్ శంకర్‌
YS Jagan:మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీయే- జగన్‌
Janasena :ఈనెల 14న జనసేన పార్టీ ఆవిర్భావ సభ.. భారీ ఏర్పాట్లు