Telangana congress:మహేశ్ కుమార్ అధ్యక్షతన పార్లమెంట్ నియోజకర్గాల వారీగా సమావేశాలు
Parliamentary constituency-wise meetings chaired by Mahesh Kumar

మహేశ్ కుమార్ అధ్యక్షతన పార్లమెంట్ నియోజకర్గాల వారీగా సమావేశాలు.
హైదరాబాద్ - సూర్య టుడే :తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నెల 4వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు మెదక్ పార్లమెంటు నియోజవర్గ సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు మల్కాజిగిరి పార్లమెంటు కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం జరగనుంది. ఈ సమావేశాలకు ముఖ్యఅతిథిగా ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరుకాబోతున్నారు. సమావేశంలో పాల్గొననున్న పార్లమెంట్ పరిధిలోని మంత్రులు, ఇంచార్జ్ మంత్రి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, నియోజక వర్గాలలో పోటీ చేసిన అభ్యర్థులు, టీపీసీసీ ఆఫీస్ బేరర్లు, అనుబంధ సంఘాల చైర్మన్ లు, కార్పొరేషన్ చైర్మన్ లు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యే లు, మాజీ ఎమ్మెల్సీ లు, అధికార ప్రతినిధులు, జాతీయ, రాష్ట్ర స్థాయిలో అనుబంధ సంఘాలలో ఉన్న నాయకులు, సీనియర్ నాయకులు. పాల్గొనలన్నారు.