BJP VS CONGRESS:బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట.. మామునూర్ వద్ద టెన్షన్
Fight between BJP and Congress workers.. Tension at Mamunur
By P.Rajesh
On

బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట.. మామునూర్ వద్ద టెన్షన్
వరంగల్ -సూర్య టుడే :వరంగల్ జిల్లా మామునూర్ వద్ద బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. రెండు వర్గాల తోపులాటలో మామునూరు వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. మామునూర్ విమానాశ్రయానికి ఇటీవల కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి పూలాభిషేకం చేసేందుకు బీజేపీ శ్రేణులు వచ్చాయి. బీజేపీ నేతలు వచ్చిన సమయంలోనే విమానాశ్రయం వద్దకు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా వచ్చారు. ఇరువర్గాలు ఒకేసారి విమానాశ్రయం వద్దకు రావడంతో ఘర్షణ తలెత్తింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించి వేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. మరోవైపు విమానాశ్రయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Views: 261
Latest News

15 Mar 2025 20:09:24
హయత్ నగర్-సూర్య టుడే:ప్రజలకు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నట్లు హయత్ నగర్ ఇన్ స్పెక్టర్ నాగ రాజు గౌడ్ తెలిపారు. ఇన్ స్పెక్టర్...