ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 8 మంది ఆచూకీ తెలియక కుటుంబ సభ్యుల ఆందోళన
Family members worried as 8 people missing in SLBC tunnel
By P.Rajesh
On

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 8 మంది ఆచూకీ తెలియక కుటుంబ సభ్యుల ఆందోళన
నాగర్ కర్నూల్- సూర్య టుడే
నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంటకు సమీపంలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో సహాయక చర్యలు పదో రోజుకు చేరుకున్నాయి. షిఫ్ట్‌ల వారీగా రెస్క్యూ సిబ్బంది ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయి. జీపీఆర్ ఆధారంగా అనుమానిత ప్రాంతాల్లో విస్తృతంగా తవ్వకాలు చేపట్టారు. టన్నెల్‌లో చిక్కుకున్న 8 మంది ఆచూకీ కోసం తీవ్రంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. అయితే బురద, నీరు రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకంగా మారుతున్నాయి. ఇప్పటికీ కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ కాలేదు. ఇవాళ కన్వేయర్ బెల్ట్‌ను పునరుద్ధరించే అవకాశం ఉంది. ప్రమాదకర ప్రాంతాల్లో రోబోలను వినియోగించాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. పది రోజులుగా తమ వారి ఆచూకీ తెలియకపోవడంతో టన్నెల్‌లో చిక్కుకున్న వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
Views: 168
Related Posts
Latest News
14 Mar 2025 08:21:32
హైదరాబాద్ -సూర్య టుడే:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుండి ఒంటిపూట బడులను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. వేసవి ప్రారంభంలోనే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.ఈ మేరకు ప్రభుత్వం...