Harsha Rao Vs Revanth Reddy :రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు సవాల్
Harish Rao challenges Revanth Reddy
By P.Rajesh
On

రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు సవాల్
హైదరాబాద్ -సూర్య టుడే :
సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌రావు సవాల్ విసిరారు. బీఆర్ఎస్ హయాంలో ఎస్‌ఎల్‌బీసీ పనులు జరగలేదని నిరూపించాలని అన్నారు. అలా నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. లేదంటే సీఎం పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా?.. అని ప్రశ్నించారు. ఎస్‌ఎల్‌బీసీ విషయంలో రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని చెప్పారు. పది రోజులు గడుస్తున్నా గల్లంతైన వారి ఆచూకీ కనిపెట్టలేకపోయారని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో అన్ని విషయాలను ఎండగడతామని హరీశ్‌రావు అన్నారు. తాను ఎంజాయ్ చేసేందుకు దుబాయ్ వెళ్లలేదని.. కొత్త ప్రభాకర్ రెడ్డి కూతురి పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు తాను దుబాయ్ వెళ్లినట్టు స్పష్టం చేశారు హరీశ్‌రావు.
Views: 28
Related Posts
Latest News
14 Mar 2025 08:21:32
హైదరాబాద్ -సూర్య టుడే:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుండి ఒంటిపూట బడులను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. వేసవి ప్రారంభంలోనే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.ఈ మేరకు ప్రభుత్వం...