-మహిళా పోలీసుల సేవలు అభినందనీయం.
The services of women police officers are commendable.

హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవంవేడుకలు..
హయత్ నగర్ -సూర్య టుడే : విధి నిర్వహణలో మగవారితో సమానంగా పాల్గొంటున్న మహిళా పోలీసుల సేవలు అభినందనీయమని హయత్ నగర్ ఇన్ స్పెక్టర్ పి. నాగరాజ్ గౌడ్
అన్నారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా
హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఇన్ స్పెక్టర్ పి. నాగరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవంవేడుకలను ఘనంగా జరుపుకున్నారు.మొదటగా మహిళ పోలీస్ సిబ్బంది ని శాలువాలతో సన్మానించి వివిధ రంగాల పురోగతిలోవెన్నెముఖగా నిలుస్తున్న మహిళల కు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇన్ స్పెక్టర్ మాట్లాడుతూ
మహిళలకు ఓర్పు, సహనం ఎక్కువ, ప్రపంచానికి వెలుగు చూపేది మహిళ అని అన్నారు.పురుషులతో పోటీపడుతూ ఉద్యోగ అవకాశాల్లో, విధుల్లో వారితో సమానంగా మహిళలు పని చేయడం గొప్ప విషయం అని తెలిపారు. పురుషుల కన్నా మహిళకే పట్టుదల ఎక్కువ అని, ఇతర రంగాల్లో పురుషులతో పోటీ పడుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్ స్పెక్టర్లు,మహిళా సిబ్బంది పాల్గొన్నారు.