దళితుడు కావడం వల్లే స్పీకర్‌కు గౌరవం ఇవ్వలేదు- ఆది శ్రీనివాస్(Aadi Srinivas)

మాజీ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, కేటీఆర్ దిష్టిబొమ్మలు దహనం
కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్తున్నాయని ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి వేములవాడలో మాజీ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, కేటీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ... రాష్ట్ర గవర్నర్, శాసనసభ స్పీకర్, ముఖ్యమంత్రి అంటే జగదీశ్వర్ రెడ్డి్కి గౌరవం లేదన్నారు. జగదీశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదని కేటీఆర్, బీఆర్ఎస్ వెనకుసుకు రావడం సరికాదన్నారు. ఇంకా తామే అధికారంలో ఉన్నట్లు బిఆర్ఎస్ నాయకులు ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత వ్యక్తి కావడం వల్లే స్పీకర్‌కు బీఆర్ఎస్ శాసనసభ్యులు గౌరవం ఇవ్వడం లేదన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని అప్పులకుప్పుగా బీఆర్ఎస్ మార్చిందని ఆయన ఆరోపించారు. దళిత వ్యతిరేక పార్టీగా బీఆర్ఎస్ వ్యవహరిస్తుందన్నారు ఆదిశ్రీనివాస్.
-------