హీరో విశ్వక్ సేన్ సోదరి ఇంట్లో భారీ చోరీ:Massive theft at hero Vishwak Sen's sister's house
By P.mamatha
On

హీరో విశ్వక్ సేన్ సోదరి ఇంట్లో భారీ చోరీ
టాలీవుడ్ హీరో హీరో విశ్వక్ సేన్ సోదరి ఇంట్లో భారీ చోరీ జరిగింది. HYD ఫిలింనగర్ రోడ్డునెంబర్–8లోని ఓ ఇంట్లో నివసిస్తున్న ఆమె తెల్లవారి తన గదిలో వస్తువులు చిందరవందరగా పడి ఉండడం చూసి పరిశీలించగా రెండు బంగారు డైమండ్ ఉంగరాలతో పాటు ఒక హెడ్‌ఫోన్ కనిపించలేదు. దీంతో ఆమె తండ్రి రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు క్లూస్ టీంతో వేలిముద్రలు సేకరించారు. గుర్తుతెలియని వ్యక్తి బైక్‌పై వచ్చినట్లు గుర్తించారు. దర్యాప్తు కొనసాగుతోంది.చోరీకి గురైన ఆభరణాల విలువ రూ.2.20 లక్షలు ఉంటుందని తెలుస్తోంది. అందులో రెండు డైమండ్ రింగ్స్ కూడా ఉన్నట్లు ఫిర్యాదులు పేర్కొన్నారు.
Views: 226
Latest News
17 Mar 2025 19:51:29
మాజీ వైస్ చైర్పర్సన్ హరిత ధన్ రాజ్ గౌడ్ పై ఆరోపణలు సరికాదు.