మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

Women should excel in all fields.

On
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
తుర్కయంజాల్ -సూర్య టుడే : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని  తుర్కయంజాల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొత్త కురుమ మంగమ్మ ఆధ్వర్యంలో శనివారం ఆమె నివాసంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్ర్తీసృష్టికి మూలమని,స్ర్తీ లేకపోతే జననం లేదని అన్నారు..ప్రతి ఒక్కరు మహిళలను గౌరవించాలని, అది మన సంప్రదాయం  అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని పేర్కొన్నారు.సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ప్రతిభ కనబర్చి ముందుకు వెళ్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ డైరెక్టర్ బి. భవిత, మల్లికా శ్యామల తదితరులు పాల్గొన్నారు

Views: 49

Latest News