park-kabza:శ్రీ రంగా పురం కాలనీ లోని పార్క్ కబ్జా కాలేదు.

ఓ మహిళ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా ఆవాస్తవం.

On
park-kabza:శ్రీ రంగా పురం కాలనీ లోని పార్క్ కబ్జా కాలేదు.

మాజీ వైస్‌ చైర్‌పర్సన్‌ హరిత ధన్ రాజ్ గౌడ్ పై ఆరోపణలు సరికాదు.

తుర్కయంజాల్‌ -సూర్య టుడే:తుర్కయంజాల్‌ మున్సిపాలిటీ 24వ వార్డు పరిధిలోని శ్రీరంగాపురంలో
కాలనీ మీదుగా వెళ్లే 40 ఫీట్ల రోడ్డు, పార్క్‌ స్థలం విషయంలో ఓ మహిళ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని కాలనీ వాసులు తెలిపారు..కాలనీ అధ్యక్షులు గణేష్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా కాలనీ వాసులు మాట్లాడుతూ తమ కాలనీ లోఎలాంటి కబ్జా జరగలేదని, మాజీ వైస్‌ చైర్‌పర్సన్‌పై ఆరోపణలు సరికాదని ఖండించారు.  2006 నుంచి  40 ఫీట్ల రోడ్డు తగాదా ఉందన్నారు. హరిద్వార్‌ వాళ్ల భూమికి ఫెన్సింగ్‌ వేసుకున్నారని,  రోడ్డు మూసివేయడం వల్ల శ్రీరంగాపురం కాలనీ రెండుగా విభజించినట్లు అయిందన్నారు. కాలనీ పెద్దల అంగీకారంతోనే   పార్కు జాగా నుంచి అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, తాగునీటి పైప్‌లైన్‌ మళ్లించామని తెలిపారు.ఇందులో వైస్‌ చైర్‌ పర్సన్‌, ఆమె భర్త ప్రమేయం లేదని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్రీరంగాపురం కాలనీ  ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె.శంకర్‌, అడ్వయిజర్‌ శ్రీనివాస్‌ నేత, కాలనీ వాసులు ఈ.కమల్‌రాజ్‌, రవీందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, కె.రజిత, ఎల్‌.సునీత వెంకట్ రెడ్డి, పి.శ్రీలత, కె.గీత, పి.అంజమ్మ, కె.వెంకటేశ్వర్లు, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Views: 83

Latest News