SLBC టన్నెల్‌లో రోబోలు
Robots in the SLBC tunnel

నాగర్ కర్నూలు జిల్లా SLBC టన్నెల్‌లో 18వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. నలుగురు సభ్యుల రోబోటిక్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ టీమ్ టన్నెల్ లోపలికి వెళ్లింది. పరిస్థితులను అంచనా వేయడానికి టన్నెల్‌లోకి లోకో ట్రైన్‌లో కమ్యూనికేషన్ రోబోను పంపించారు అధికారులు. టన్నెల్ లోపల పరిస్థితులపై అధికారులు సమావేశం నిర్వహించనున్నారు. పరిస్థితులు అనుకూలంగా ఉంటే రేపు టన్నెల్‌లోకి రోబోలు పంపించబోతున్నారు. అలాగే కడావర్ డాగ్స్ గుర్తించిన మరో రెండు చోట్ల తవ్వకాలు కొనసాగిస్తున్నారు. లోకో ట్రైన్ ట్రాక్ పునరుద్ధరణతో వేగంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నెల్‌లోకి 13.20 కిలోమీటర్ల వరకు లోకో ట్రైన్ వెళ్తోంది. కడావర్ డాగ్స్‌తో మరోసారి స్పాట్లను గుర్తించే పనిలో ఉన్నారు అధికారులు. NGRI, సిస్మాలజీ, జియాలజీ బృందాలతో అన్వేషణ కొనసాగిస్తున్నారు. షిఫ్టుల వారీగా రెస్క్యూ పనులను 150 మంది అధికారులు పర్యవేక్షిస్తున్నారు