పేదల భూములు గుంజుకోవద్దు
ప్రభుత్వం భూసేకర ప్రక్రియను వెంటనే నిలిపివేయాలి.

మాజీ సర్పంచ్ బండి మీద కృష్ణ డిమాండ్
యాచారం :ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ పేరుతో పేదల భూములు గుంజుకుంటే ఊరుకోబోమని మాజీ సర్పంచ్ బండి మీద కృష్ణ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆదివారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. యాచారం మండల పరిధిలో మొండి గౌరెల్లి రెవిన్యూ పరిధిలో సర్వే నెంబర్లు 19, 68, 127 లో ఎక్కువమంది దళిత రైతులే ఉన్నారు. ఈ సర్వే నెంబర్లలో
821 ఎకరాల భూమి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక పార్కు కోసం భూసేకరణ చేయాలని కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చినట్లు తెలిపారు. ఈ భూములను తరతరాలుగా దళితులు భూమిని దున్నుకొని జీవనం సాగిస్తున్నారు.అలాంటి పేద రైతుల భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం రకరకాల కంపెనీల పేరుతో భూములు పుంజుకోవడం ఆ గ్రామ రైతులందరూ ఖండిస్తున్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే భూసేకరణ ఆపేయాలని డిమాండ్ చేశారు. మా ప్రాణాలు అడ్డుపెట్టైనా మా భూములను కాపాడుకుంటాం. కానీ ప్రభుత్వానికి ఇచ్చేది లేదని ఆ గ్రామస్తులు, రైతులు తేల్చి చెప్తారు. ఈ ఉద్యమంలో పార్టీలకతీతంగా కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.