మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం..

తుర్కయంజాల్- సూర్యటుడే:రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీమంత్రి జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను ఆదివారం తుర్కయంజాల్ కూడలిలో మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొత్త కుర్మ మంగమ్మ శివ కుమార్ ఆధ్వర్యంలో దహనం చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అసెంబ్లీ స్పీకర్ దళితుడు అయినందునే ఉన్నతవర్గాల ఎమ్మెల్యేలు అతని పోడియంపై విరుచుకుపడి అగౌరవపర్చడం సరికాదన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. సభా మర్యాదలు పాటించకుండా స్పీకర్ ఎమ్మెల్యేలను అనుచితంగా మాట్లాడడం సరికాదన్నారు.
దళితులకు టిఆర్ఎస్ పార్టీ కి ఎప్పుడైనా చిన్నచూపేనని జగదీశ్వర్ రెడ్డి కి ప్రజలే తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు ఈ కార్యక్రమంలో టిపీసీసీ కార్యదర్శి కొత్తకుర్మ శివకుమార్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుంట గోపాల్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ యాదాద్రి భువనగిరి ఇంచార్జ్ కొత్తకుర్మ యశ్వంత్,గుడ్ల అర్జున్,గుండా శ్రీశైలం, భాస్కర్ రావు, గుడ్ల తిరుమలేష్, రవి,సైదులు,భరత్ తదితరులు పాల్గొన్నారు