పార్లమెంట్‌లో బీఆర్‌ఎస్‌కు సున్నా రావటానికి కారణం నేనే

I am the reason why BRS got zero votes in Parliament.

On
పార్లమెంట్‌లో బీఆర్‌ఎస్‌కు సున్నా రావటానికి కారణం నేనే

పార్లమెంట్‌లో బీఆర్‌ఎస్‌కు సున్నా రావటానికి కారణం నేనే
కేసీఆర్‌ను కుర్చీల్లోంచి దించింది తానే
కేసీఆర్‌కు అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేదు.
కిషన్‌రెడ్డికి నిధులు తెచ్చే సత్తా లేదు 
తెలంగాణ కోసం ఎన్నిసార్లూ అయినా ఢల్లీికి వెళ్తా : చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్‌,మార్చి10: పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు గుండుసున్నా రావటానికి తానే కారణమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మీడియాతో చిట్‌చాట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై విమర్శలతో దాడి చేశారు. కేసీఆర్‌ను ఓడిరచి.. సీఎం కుర్చీలో నుంచి దింపింది తానే అన్నారు రేవంత్‌. ఎంపీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు గుండు సున్నా వచ్చిందంటే కారణం తానేనని కేటీఆర్‌ గుర్తించాలని చెప్పారు. స్టేటస్‌ గురించి కేటీఆర్‌ మాట్లాడుతున్నారు.. అసలు కేటీఆర్‌ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? అని ప్రశ్నించారు. అధికారం పోయిందనే అక్కసుతో కేటీఆర్‌ మాట్లాడుతున్నారు. కేసీఆర్‌ది అసెంబ్లీకి వచ్చే స్థాయి కాదన్నారు. క్రిమినల్స్‌ ఎప్పుడూ కేసులకు భయపడరు. కేసులకు భయపడితే క్రైమ్‌ చేయరు. అందుకే కేటీఆర్‌ భయపడను అంటున్నారంటూ రేవంత్‌రెడ్డి విమర్శించారు. కేటీఆర్‌ గురించి మాట్లాడడం కూడా అనవసరం అంటూ ఎద్దేవా చేశారు. కిషన్‌రెడ్డి నేనే మెట్రో తెచ్చానంటున్నారు.. కిషన్‌రెడ్డి తెచ్చిన మెట్రో ఎక్కడుంది? అని సీఎం రేవంత్‌ ప్రశ్నించారు. తెలంగాణకు కిషన్‌రెడ్డి నిధులుతెస్తే సన్మానం చేస్తానని చెప్పారు. కనీసం అఖిలపక్ష భేటీకి కిషన్‌రెడ్డి రాలేదని రేవంత్‌ విమర్శించారు. కిషన్‌రెడ్డి కేంద్రం నుంచి నిధులు తెస్తే వద్దంటామా..? అని సీఎం రేవంత్‌ ప్రశ్నించారు. రింగ్‌ రోడ్డు అంటే రింగ్‌ ఉండాలి కదా.. మరి సగం ఇచ్చి రింగ్‌ అని ఎలా అంటారని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్ర సమస్యలపై ఉమ్మడి పోరాటం కోసం అఖిలపక్షం పెడితే బీజేపీ వాళ్లు రాలేదు.. కేసీఆర్‌ ఏమైనా అంటారనే కిషన్‌ రెడ్డి ఆ సమావేశానికి రాలేదేమో అని సీఎం రేవంత్‌ అన్నారు. అన్ని రాష్ట్రాలను బీజేపీ సమానంగా చూడటం లేదని సీఎం రేవంత్‌ ఆరోపించారు. బుల్లెట్‌ ట్రైన్‌ గుజరాత్‌ ఇచ్చారు.. తెలంగాణ ఎందుకు ఇవ్వడం లేదని రేవంత్‌ ప్రశ్నించారు. తెలంగాణ కడుతున్న పన్నులు ఎంత .. తిరిగి కేంద్రం కేటాయించిన నిధులు ఎంత..? చర్చకు వస్తానంటే సీఎంగా తాను, భట్టి చర్చకు రావడానికి సిద్ధమని కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం 99 సార్లయినా ఢల్లీి వెళ్తానని చెప్పారు. తాను ఢల్లీికి వెళ్లడం వల్లనే హైదరాబాద్‌లో అభివృద్ధి కావాల్సిన క్లియరెన్స్‌ వచ్చిందని రేవంత్‌ చెప్పారు. పట్టభద్రుల ఎన్నికల్లో అసలు పోటీ చేయకుండా తప్పించుకున్నది బీఆర్‌ఎస్‌ కాదా..? అని రేవంత్‌ ప్రశ్నించారు. హరీశ్‌ రావు లాంటి వాళ్ళు దొంగ దెబ్బ తీశారని సీఎం చిట్‌చాట్‌లో కామెంట్‌ చేశారు. మందకృష్ణ మాటలు బీజేపీ మాటలుగా కొట్టిపడేశారు. ఏపీలో అసలు వర్గీకరణే మొదలుకాలేదని తిప్పికొట్టారు. గతంలోనే పూర్తిచేసి ఉంటే ప్రమాదం జరిగేదికాదు.. చావులను కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారని రేవంత్‌ విమర్శించారు.

Views: 52

Latest News

Half Day Schools: తెలంగాణలో ఒంటిపూట బడులు.. జీవో జారీ! ... Half Day Schools: తెలంగాణలో ఒంటిపూట బడులు.. జీవో జారీ! ...
హైదరాబాద్ -సూర్య టుడే:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుండి ఒంటిపూట బడులను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. వేసవి ప్రారంభంలోనే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.ఈ మేరకు ప్రభుత్వం...
Yoga vs Walking:నడక లేదా యోగా ఏది చేస్తే బరువు తగ్గుతారో తెలుసా?
TUWJ(IJU ):టీయూడబ్ల్యుజే (ఐజేయు) కమిటీని రద్దు చేయాలి
Mal Reddy Ram Reddy:జర్నలిస్టు శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర రోడ్డు డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి ఆర్ధికసాయం అందజేత
CM Chandrababu : తల్లికి, చెల్లికి వాటా ఇవ్వని వ్యక్తి సీఎంగా పనిచేశారు- చంద్రబాబు
గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించారు- పాయల్ శంకర్‌
YS Jagan:మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీయే- జగన్‌