Harish Rao:కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు అన్యాయం : హరీశ్‌రావు
Injustice to Telangana under Congress rule: Harish Rao

హైదరాబాద్: కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు నాటి నుంచి నేటి వరకు అన్యాయమే జరిగిందని, ఇప్పుడు జరుగుతుందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు మాట్లాడారని హరీష్‌రావు ధ్వజమెత్తారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల 299 టీఎంసీల నీటి పంపకాలు చేశారని చెప్పారు. 299 టీఎంసీల నీటి వినియోగం కంటే ఎక్కువ ప్రాజెక్టులు లేవని తెలిపారు. పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్‌చావును సీఎం రేవంత్ రెడ్డి కోరుకున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో హరీష్‌రావు చిట్‌చాట్ చేశారు. తెలంగాణ కోసం ప్రాణాలు ఫణంగా పెట్టిన కేసీఆర్ చావు కోరుకోవడం తప్పు.. అందుకే అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి స్పీచ్‌ను బహిష్కరించామని హరీష్‌రావు అన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టలేదు కాబట్టి..299 టీఎంసీల నీ