ఘనంగా శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.

రథోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి.
చండూర్ : చండూరు మండల పరిధిలోని తుమ్మలపల్లి గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామిబ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం జరిగిన రథోత్సవంలో మునుగోడు ఎమ్మెల్యేరాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఆలయఅర్చకులు, కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతంపలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలపైశ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని భగవంతుని కోరుకుంటున్నానని తెలిపారు. ఆలయ అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు.కార్యక్రమంలో చైర్మన్ గన్ రెడ్డి రమ్య రామలింగారెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి నాగిరెడ్డి, దేవాలయం కమిటీ ఇన్స్పెక్టర్ సుమతి, అర్చకులు కారువంగ నర్సింహ శర్మ, తిరుపతయ్య శర్మ, శంకర్ శర్మ, గిరి ప్రసాద్ శర్మ, హరి ప్రసాద్ శర్మ, దేవాలయ కమిటీ సభ్యులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు అభిమానులు, మహిళలు, యువకులు, చిన్నారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.