MLA Anirudh Reddy:ఎమ్మెల్యేకే స్పందించకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి?

హైడ్రాపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

On
MLA Anirudh Reddy:ఎమ్మెల్యేకే స్పందించకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి?

నోటీసులు ఇచ్చి లావాదేవీలు నడుపుతున్నారు : ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి 

They are conducting transactions by issuing notices: MLA Anirudh Reddy

హైదరాబాద్‌: హైడ్రా నోటీసులు ఇచ్చి లావాదేవీలు నడుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి పేర్కొన్నారు. హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ఫోన్‌ లిఫ్ట్‌ చేయడు.. ఆయన దగ్గర నుండి ఎలాంటి రెస్పాన్స్‌ ఉండదని ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేకే స్పందించకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. మ్యాన్‌ హట్టన్‌ ప్రాజెక్టుపై మరోసారి సీఎం రేవంత్‌ రెడ్డికి ఫిర్యాదు చేస్తా అని అనిరుధ్‌ రెడ్డి పేర్కొన్నారు. ఖాజాగూడలోని కొత్తకుంటలో వంశీరాం బిల్డర్లు నిర్మాణాల విషయంలో ఇటీవల హైడ్రా తీరుపై ఎమ్మెల్యే అనిరుధ్‌ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా హైడ్రాపై మరోసారి ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Views: 177

Latest News