HARISH RAO:బీఆర్‌ఎస్‌ చేసిన మంచి పనులు కప్పిపుచ్చే ప్రయత్నం

Attempt to cover up the good works done by BRS

On
 HARISH RAO:బీఆర్‌ఎస్‌ చేసిన మంచి పనులు కప్పిపుచ్చే ప్రయత్నం

బీఆర్‌ఎస్‌పై కక్షను రైతులను మీద చూపించొద్దు 
కాంగ్రెస్‌ నాయకులు కళ్లున్న కబోదులు 
కాళేశ్వరం తెలంగాణకు వరప్రదయిని : తన్నీరు హరీశ్‌రావు


సిద్దిపేట,సూర్య టూడే- చేసిన మంచిపనులను కాంగ్రెస్‌ పార్టీ కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుందని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీమంత్రి హరీశ్‌రావు అన్నారు. గతంలో కేసీఆర్‌ చేసిన అభివృద్ధిని కూడా చెరపేసే ప్రయత్నాలు సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్నారని దుయ్యబట్టారు. చిన్న కోడూరు మండలం, చంద్లపూర్‌లోని రంగనాయక సాగర్‌ ప్రాజెక్ట్‌ను హరీష్‌ రావు బుధవారం సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సిద్దిపేట నియోజక వర్గంలో 50వేల ఎకరాల్లో పంట సాగు అవుతుందని, తన కోరిక మేరకు ఒక్క టీఎంసీ నీటిని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విడుదల చేశారన్నారు. గత ప్రభుత్వం (బీఆర్‌ఎస్‌) చేసిన మంచి పనులను కాంగ్రెస్‌ ప్రభుత్వం తుడిచి పెట్టాలని చూస్తోందని, ఎస్‌ఆర్‌ఎస్పీ నీరు తగ్గినా కూడా కాళేశ్వరం ద్వారా రెండు పంటలకు సాగునీరు విడుదల చేశామని హరీష్‌ రావు చెప్పారు. మేడిగడ్డలోని ఒక్క బ్లాక్‌లోని ఒక పిల్లర్‌ మాత్రమే కుంగితే బీఆర్‌ఎస్‌ పై బురద జల్లి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఇప్పుడు గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయని, కేసీఆర్‌పై కోపంతో తెలంగాణ రైతులకు అన్యాయం చేయవద్దని కోరారు. కల్లులేని కబోదుల్లగా కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. కాళేశ్వరం తెలంగాణకు వరప్రదయిని అని.. ఇప్పటికైనా కాంగ్రెస్‌ నాయకులు కళ్లు తెరవాలని హరీష్‌ రావు సూచించారు.కాగా ప్రభుత్వ భూముల అమ్మకానికి కాంగ్రెస్‌ సర్కార్‌ పన్నాగం వేసిందని మాజీమంత్రి హరీశ్‌ రావు ఆరోపించారు. భూములు అమ్మే ప్రసక్తే లేదని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి.. సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే ఇంచు భూమిని కూడా అమ్మబోమని ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేసి.. ఇప్పుడు రూ. వేల కోట్ల విలువైన భూములను వేలం వేసేందుకు సిద్ధమవుతున్నారని ఆరోపించారు. హెచ్‌ఎండీఏ మాస్టర్‌ ప్లాన్‌ పేరిట వేలం పాట నిర్వహించేందుకు కన్సల్టెంట్‌ నియామకానికి గత నెల 28న టెండర్లు పిలవడం సర్కారు దిగజారుడు తనానికి పరాకాష్ఠ అన్నారు. తెలంగాణ దేశానికి రోల్‌మోడల్‌ అయిందని టెండర్‌ నోట్‌లో ప్రస్తావించారని తెలిపారు. బీఆర్‌ఎస్‌ పాలనలో అద్భుతమైన ప్రగతిని సాధించిన తెలంగాణను కాంగ్రెస్‌ 14 నెలల పాలనలో తిరోగమనం బాట పట్టించారని సోషల్‌ మీడియా ఎక్స్‌ వేదికగా హరీశ్‌రావు విమర్శించారు. బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి  కి ధన్యవాదాలు తెలిపారు. రంగనాయక సాగర్‌లోకి నీటిని విడుదల చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.

Views: 7

Latest News