:senior journalist -తుర్కయంజాల్ విశాలాంధ్ర రిపోర్టర్ శ్రీనివాస్ ఆకస్మిక మరణం

Turkayamjal Visalandhra reporter Srinivas passes away suddenly

On
:senior journalist -తుర్కయంజాల్ విశాలాంధ్ర రిపోర్టర్ శ్రీనివాస్ ఆకస్మిక మరణం

తుర్కయంజాల్ విశాలాంధ్ర రిపోర్టర్ శ్రీనివాస్ ఆకస్మిక మరణం
ఇబ్రహీంపట్నం- సూర్య టుడే న్యూస్ ప్రతినిధి :
గత 15 సంవత్సరాలుగా పలు పత్రికలలో పనిచేసి ప్రస్తుతం తుర్కయంజాల్ విశాలాంధ్ర పాత్రికేయునిగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ ఆదివారం ఆకస్మిక మరణం చెందారు. విషయం తెలుసుకున్న తుర్కయంజాల్ జర్నలిస్ట్ కాలనీ సోదరులు హుటా హుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మరణం తీరని లోటని వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు, నియోజకవర్గ జర్నలిస్టు సంఘం టి యు డబ్ల్యూ జే 143 సంఘం అధ్యక్షుడు సురమోని సత్యనారాయణ తో పాటు వర్కింగ్ జర్నలిస్టు  సోదరులు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఆయన ఆకస్మిక మరణం పట్ల దిగ్భ్రాంతి చెందారు. ఒక సీనియర్ జర్నలిస్టు ఆకస్మిక మరణం బాధాకరమని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తుర్కయంజాల్ జర్నలిస్టు కాలనీలో సోమవారం మధ్యాహ్నం సమయంలో అంత్యక్రియలు జరుగుతాయని అంతిమయాత్రకు హాజరుకావాలని కుటుంబ సభ్యులు, కాలనీ జర్నలి సోదరులు తెలిపారు.

Views: 305

Latest News