SCIENCE:విద్యార్థుల ప్రతిభను గుర్తించేందుకు సైన్స్ ఫెయిర్
Science fair to recognize student talent

విద్యార్థుల ప్రతిభను గుర్తించేందుకు సైన్స్ ఫెయిర్
ఇబ్రహీంపట్నం- సూర్య టుడే : విద్యార్థుల ప్రతిభను గుర్తించేందుకే సైన్స్ ఫెయిర్ ఉపయోగపడుతుందని ఇబ్రహీంపట్నం ఆంగ్లిస్ట్ స్కూల్ కరస్పాండెంట్ నీలం భాను అన్నారు.సైన్స్ ఫేర్ ద్వారా విద్యార్థుల క్రియేటివిటీ బయట పడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ మాట్లాడుతూ.. విద్యార్థులకు ఉపాధ్యాయులు బోధించిన పాఠ్యాంశాలపై నైపుణ్యాన్ని వెలికి తీయడం లక్ష్యమన్నారు. ప్రతి విద్యార్థి ప్రత్యేక శ్రద్ధ వహించి చదవాలన్నారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించడం గురువుల బాధ్యత అని తెలిపారు. విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ఫెయిర్ ప్రదర్శనలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వాటిని జిల్లా స్థాయికి తీసుకు వెళ్తామన్నారు. విద్యార్థులు రూపొందించిన వర్కింగ్ మోడల్స్ వీక్షించి స్టూడెంట్ ను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు తమలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి అద్భుతమైన ప్రాజెక్టులను రూపొందించారని, విద్యార్థులను చూస్తుంటే బాల శాస్త్రవేత్తలుగా కనిపిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ నీళ్ల చెన్నయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.