అసెంబ్లీ సమావేశాలకు నేను కూడా వస్తున్నా- కేసీఆర్
I am also coming to the assembly meetings - KCR
By P.Rajesh
On

అసెంబ్లీ సమావేశాలకు నేను కూడా వస్తున్నా- కేసీఆర్
హైదరాబాద్-సూర్య టుడే:
రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకాబోతున్నాయి. అధికార పక్ష, విపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది.
పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం మూడు గంటలకు పైగా కొనసాగింది. ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై సూచనలు చేశారు. అందరం కలిసి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామని కేసీఆర్.. బీఆర్ఎస్ నేతలకు సూచించారు. అసెంబ్లీ సమావేశాలకు తాను కూడా వస్తున్నానని ఈ సందర్బంగా కేసీఆర్ పార్టీ నేతలకు తెలిపారు.
Views: 72
Latest News
13 Mar 2025 06:24:34
నడక లేదా యోగా ఏది చేస్తే బరువు తగ్గుతారో తెలుసా?
ప్రస్తుత మారుతున్న జీవనశైలి, పొల్యూషన్, తిండి అలవాట్ల కారణంగా జీవితంలో ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండటం సవాల్‌తో...