CM Revanth Reddy:జానారెడ్డితో సిఎం రేవంత్‌ భేటీ

CM Revanth meets Jana Reddy

On
CM Revanth Reddy:జానారెడ్డితో సిఎం రేవంత్‌ భేటీ

జానారెడ్డితో సిఎం రేవంత్‌ భేటీ
తాజా రాజకీయాలపై ఇరు నేతల చర్చ
హైదరాబాద్‌: తాజా రాజకీయాల నేపథ్యంలో అనూహ్యంగా సీఎం రేవంత్‌ రెడ్డి.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి జానారెడ్డి నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా సుమారు అరగంటకు పైగా వీరి మధ్య పలు అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అయితే జానారెడ్డితో సీఎం రేవంత్‌ భేటీపై ప్రభుత్వ వర్గాలలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. జానారెడ్డిని ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం అడిగితే సలహాలు ఇస్తాననని జానారెడ్డి బుధవారం విూడియాతో తెలిపారు. దీంతో వీరి భేటీపై అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. జానారెడ్డి వ్యాఖ్యల వల్లే.. ముఖ్య సలహాదారు పదవి ఆఫర్‌ చేయడానికి సీఎం వెళ్లారంటూ చర్చించుకుంటున్నారు. త్వరలో కేబినెట్‌ విస్తరణ 
ఉంటుందనే ఊహాగానాలతో ఈ భేటీ ప్రాధాన్యతతలను సంతరించుకుంది. అలాగే ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తదితర అంశాలపైనా ఇరువురు నేతలు చర్చించివుంటారని అనుకుంటున్నారు. 

Views: 14

Latest News

మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం.. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం..
తుర్కయంజాల్- సూర్యటుడే:రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీమంత్రి జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను ఆదివారం తుర్కయంజాల్ కూడలిలో మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ...
పేదల భూములు గుంజుకోవద్దు
హీరో విశ్వక్ సేన్ సోదరి ఇంట్లో భారీ చోరీ:Massive theft at hero Vishwak Sen's sister's house
తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు తొలగించడం దుర్మార్గం- బండి సంజయ్‌
SLCB Tunnel :ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలు.. పనులను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్‌:Relief efforts ongoing at SLBC Tunnel.. District Collector supervises work
దళితుడు కావడం వల్లే స్పీకర్‌కు గౌరవం ఇవ్వలేదు- ఆది శ్రీనివాస్‌(Aadi Srinivas)
సోముల లోకేష్ రెడ్డిపై దాడి కేసులో నిందితుల అరెస్ట్| accused arrested