Delhi :గిర్ అభయారణ్యంలో ప్రధని మోదీ లయన్ సఫారీ
PM Modi's Lion Safari in Gir Wildlife Sanctuary
By P.Rajesh
On
.jpg)
గిర్ అభయారణ్యంలో ప్రధని మోదీ లయన్ సఫారీ
సూర్య టుడే డెస్క్ : ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోదీ లయన్ సఫారీ చేశారు. గుజరాత్‌లో మూడు రోజుల పర్యటనలో ఉన్న ఆయన.. గిర్ వన్యప్రాణి అభయారణ్యంలో కలియతిరిగారు. అడవంతా తిరుగుతూ కెమెరా పట్టుకుని సింహాల ఫోటోలు తీశారు. ప్రతి ఒక్కరూ జీవ వైవిధ్యానికి కట్టుబడి ఉండాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అనంతరం ఎక్స్‌లో పోస్టు పెట్టారు. "ఈ రోజు ఉదయం, ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం నాడు, నేను గిర్‌లో సఫారీకి వెళ్లాను, ఇది మనందరికీ తెలిసినట్లుగా, గంభీరమైన ఆసియా సింహాలకు నిలయం. గిర్‌కు రావడం వల్ల నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము సమిష్టిగా చేసిన పనికి సంబంధించిన అనేక జ్ఞాపకాలు కూడా గుర్తుకు వచ్చాయి" అని అన్నారు. ప్రధాని మోదీ 2001 నుండి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.
Views: 129
Tags:
Latest News
13 Mar 2025 06:24:34
నడక లేదా యోగా ఏది చేస్తే బరువు తగ్గుతారో తెలుసా?
ప్రస్తుత మారుతున్న జీవనశైలి, పొల్యూషన్, తిండి అలవాట్ల కారణంగా జీవితంలో ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండటం సవాల్‌తో...