Jishnudev Varma:దత్తత గ్రామంలో అభివృద్ది పనులకు గవర్నర్ శంకుస్థాపనలు
Governor lays foundation stone for development works in Dattata village

హైదరాబాద్: ములుగు జిల్లా కొండపర్తి గ్రామాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దత్తత తీసుకున్నారు. మంత్రి సీతక్కతో కలిసి గ్రామంలో పర్యటించిన అనంతరం.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో జిష్ణుదేవ్ వర్మ మాట్లాడారు. తెలంగాణలో మొదటిసారి అడవి ప్రాంతానికి వచ్చానని.. ఇక్కడికి వస్తుంటే తన సొంతూరుకు వెళ్లిన అనుభూతి కలిగిందని చెప్పారు. చిన్న గ్రామమైన కొండపర్తి త్వరగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉందన్నారు. తనతో పాటు రాష్ట్రపతి, సీతక్క కూడా గిరిజన ప్రాంత వాసులమే అని చెప్పారు. గిరిజన ప్రాంతాలన్నింటికీ రోల్ మోడల్‌గా మార్చాలని.. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం, రాజ్‌భవన్ కలిసి పనిచేస్తాయని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా మాట్లాడిన మంత్రి సీతక్క.. కొండపర్తి గ్రామానికి త్వరలోనే రోడ్డు కూడా రాబోతుందని మంత్రి సీతక్క చెప్పారు. వ్యవసాయానికి సరిపడా సాగు నీరు అందించేందుకు బోర్లు వేస్తామని కూడా చెప్పారు.