hyderabad:తెల్లాపూర్ లో దారుణం.. ఆస్తి కోసం కన్న తల్లిని హత్య చేసిన కొడుకు
Son kills mother for property
By P.mamatha
On

సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లో దారుణం జరిగింది. ఆస్తి కోసం కన్నతల్లిని అతి దారుణంగా హత్య చేశాడో కొడుకు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధి డివినో విల్లాస్‌లో ఈ ఘటన జరిగింది. తాగుడుకు బానిస అయిన నవారు కార్తీక్ రెడ్డి (26) తల్లి రాధిక (52) పై కత్తితో దాడి చేశాడు. హుటాహుటిన కుటుంబ సభ్యులు అన్నపూర్ణను సిటిజెన్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నల్లగండ్లలోని సిటిషన్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. మద్యానికి బానిసై ఆస్తికోసం కుటుంబ సభ్యులతో తరచూ గొడవపడి ఈరోజు ఉదయం కార్తీక్ రెడ్డి ఈ దారుణానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Views: 11
Latest News
18 Mar 2025 19:07:42
హైదరాబాద్: మంత్రి పదవిపై దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ నోరు విప్పారు. తాను కూడా మంత్రి పదవికి పోటీలో ఉన్నానని బాలు నాయక్ పేర్కొన్నారు. అసెంబ్లీ లాబీలో...