శివన్నామస్మరణంతో మారుమోగిన ఆలయాలు

శివన్నామస్మరణంతో మారుమోగిన ఆలయాలు
కొండమల్లేపల్లి- సూర్య టుడే :మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కొండమల్లేపల్లి పట్టణ పరిసర ప్రాంత ప్రజలు కొండమల్లేపల్లి చౌరస్తాలో గల శ్రీ సీతారామచంద్రమౌళీశ్వర దేవాలయంలో బుధవారం శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటి, పురోహితుల ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజామున పురోహితులు దేవత మూర్తుల విగ్రహాలకు ప్రత్యేక అలంకరణ చేశారు. భక్తులు భారీ ఎత్తున పాల్గొని శివనామస్మరణంతో కొండమల్లేపల్లి పట్టణం మారుమోగేలా అంగరంగ వైభవంగా ఘనంగా పూజలు నిర్వహించారు .ముఖ్యంగా శివుడికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ నాయని మాధవరెడ్డి మాట్లాడుతూ హిందువులు కుటుంబ సమేతంగా వచ్చి ఆలయాలలో పూజలు నిర్వహించడం వలన మానసిక ప్రశాంతత తో పాటు ఐక్యత, మంచి నడవడిక ఏర్పడుతుందన్నారు. మన భావితరాల పిల్లలకు భారతీయ సంస్కృతిని అందజేసిన వారం అవుతామన్నారు. భారతదేశం మన హిందూ మతంలో గొప్ప సంప్రదాయాన్ని అందించిందన్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఉపవాస దీక్ష, జాగరణ ,భజన కార్యక్రమాలుంటాయన్నారు.