TG BJP:తెలంగాణ బీజేపీ టార్గెట్ 2027..!

హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలో పోటీ అందుకోసమేనా..?

On
 TG BJP:తెలంగాణ బీజేపీ టార్గెట్ 2027..!

తెలంగాణలో అధికారం కోసం బీజేపీ ప్రయత్నం
ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం
బలం లేకున్న ఎమ్మెల్సీగా పోటీ

సాయి సూర్య బ్యూరో: తెలంగాణలో బీజేపీ అధికారం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఏంటి? ఈ సారి పక్కాగా కొట్టాలని వ్యూహాలు రచిస్తోందా? అందుకే ప్రత్యేక దృష్టి సారించిందా? పార్టీ జాతీయ నాయకత్వం నుంచి అందిన ఆదేశాలు ఏంటి? నెక్స్ట్ తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఖాయమేనా? హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలో పోటీ చేయడానికి కారణం ఏంటి? 

తెలంగాణలో బీజేపీ గతంలో కంటే చాలా బలపడింది. ఒక్కరు, ఇద్దరు ఎమ్మెల్యేల నుంచి అధిక స్థానాలను కైవసం చేసుకునే వరకు వచ్చింది. ఎంపీగా అనేక స్థానాల్లో సత్త చాటింది. కేంద్రంలో మంత్రి పదవులు దక్కించుకుంది. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా సత్తా చూపింది. 

తెలంగాణలో బీజేపీ ఇప్పటికే గ్రామ స్థాయిలో
ఇటీవల రెండు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకోవడం ద్వారా జోష్ మీదున్న బీజేపీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి పవర్ లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇందుకోసం మహారాష్ట్ర, ఢిల్లీలో ఆ పార్టీ గెలుపుకు కారణం అయిన ఫార్ములాను తెలంగాణలోనూ ఇంప్లిమెంట్ చేయబోతున్నారనే టాక్ ఇప్పుడు జోరందుకుంది.  

IMG_20250426_124223

ఈ వ్యూహంలో భాగంగా జిహెచ్ఏంసి కౌన్సిల్ లో తక్కువ మంది కార్పొరేటర్లు ఉన్నా కూడా.. ఎమ్మెల్సీకి పోటీ చేసింది. ఈ స్థానం 25 ఏళ్లుగా ఏకగ్రీవం అవుతూ వస్తోంది. కానీ ఈ సారి ఎన్నిక జరిగింది. అది కూడా బీజేపీ బరిలో అభ్యర్థిని నిలపడంతోనే జరిగింది. ఈ ఎన్నికలో గెలవలెమని బీజేపీకి ముందే తెలుసు. కావలసిన బలం బీజేపీకి లేదు. ప్రస్తుతం కౌన్సిల్ లో బీజేపీకి 40 మంది కార్పొరేటర్లు ఉన్నారు. మొదట గెలిచినవి 48 అయినప్పటికీ కొంత మంది పార్టీ మారారు. దీంతో 40కి చేరింది. స్థానిక ఎన్నికలో 25 మంది ఓటింగ్ కు అర్హులు.  ఈ సంఖ్యతో గెలవడం సాధ్యం కాదని తెలుసు. కానీ పోటీ చేయడం వెనుక వ్యూహం ఉందని చెప్తున్నారు. తమ కార్పొరేటర్లు సహా బిఆర్ఎస్ సభ్యుల ఓట్లు వారికి పడితే గెలిచేది. కానీ ఆ పార్టీ ఎన్నికలకు దూరంగా ఉండటమే కాదు.. ఓట్లు కూడా వేయవద్దని ఆదేశింది. లోపాయికారి ఒప్పందం ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది. అలా జరగలేదు. ఇదిలా ఉంటే.. ఈ ఎన్నిక లో గెలవక పోయిన..నష్టం కంటే.. బూస్ట్ ఎక్కువ అంటున్నారు. వచ్చే ఏడాది జిహెచ్ఏంసి కౌన్సిల్ ఎన్నికలు జరుగుతాయి. దీంతో ఈ పోటి అప్పటికి పని చేస్తుందని భావించారట. అంతే కాదు హైదరాబాద్ లో హిందుత్వ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పు కోవడానికి కూడా పనికొస్తుంది అని చెప్తున్నారు. Mim పార్టీ, కాంగ్రెస్, BRS ఒకటేనని జనాల్లోకి తీసుకెళ్లడానికి అస్త్రంగా మారుతుందని భావిస్తున్నారు. ఇలా గెలుపు కోసం ఇప్పటి నుంచి ప్రణాళిక వేస్తున్నారు. 

images (4)

ఇక తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పై ప్రజల్లో ఇఫ్పటికే వ్యతిరేకత వచ్చింది. కాంగ్రెస్ పాలన, తీసుకుంటున్న నిర్ణయాలతో ఆ పార్టీ రోజురోజుకి బలహీన పడుతోంది. ఆ పార్టీపై ప్రజలు ఆగ్రహావేశాలతో ఉన్నారట. ఇక బీఆర్ఎస్ పై ఇంకా జనం కోపంగానే ఉన్నారు. పదేళ్ల పాలనలో జరిగిన అవినీతి, అన్యాయాలను ఇంకా మర్చిపోలేదు. బీఆర్ఎస్ కు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చినా ప్రజా సమస్యలపై పోరాటం లేదు. కేసీఆర్ కూడా బయటికి రాకపోవడంతో జనంలో మరింత ఆగ్రహానికి ఆ పార్టీ గురయ్యింది. ఇవన్నీ కారణాలు బీజేపీకి కలిసి వచ్చే అంశాలు. దీంతో ఈసారి బీజేపీకి విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు.  నేతలు కలిసికట్టుగా పని చేయాలని.. 2028 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ విజయమే లక్ష్యంగా నేతలు ముందుకు వెళ్లాలని జాతీయ నాయకత్వం సూచించింది. దీంతో రాబోయే రోజుల్లో పార్టీ అధికారంలోకి రావడమే ప్రధానంగా పనిచేయనుంది.

Views: 75

Latest News