Smita Sabharwal:వివాదాల స్మితా సబర్వాల్
స్మితా సబర్వాల్‌కు పోలీసులు నోటీసులు

స్మితా సబర్వాల్ తీరుపై సీరియస్
పోలీసుల నోటీసులకు స్పందిస్తూ ప్రశ్నలు సంధించిన ఐఏఎస్
ప్రభుత్వం సైలెంట్‌గా ఉండటంపై నెటిజన్ల ప్రశ్నలు
ఉన్నతాధికారి ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించ వచ్చా?
సాయిసూర్య, తెలంగాణ బ్యూరో:ఓ ఐఎఎస్ అధికారిని ప్రభుత్వానికి వ్యతిరేకంగామాట్లాడితే చర్యలు లేవు. ప్రశ్నిస్తే...ప్రభుత్వం నుంచిస్పందన లేదు. తెలంగాణలో ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆమె ఎవరి కోసం పని చేస్తున్నారు? వివాదాస్పద ట్విట్ల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటీ? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహరంలో రాష్ట్రంలోనే కాదు దేశంలోనూ హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్ నేతలు, సోషల్ మీడియా కంచ గచ్చిబౌలి భూమలు విషయంలో చేసిన రాద్దాంతం అంతా ఇంతాకాదు. సోషల్ మీడియాలో ఏఐ ఫోటోలతో రచ్చ చేశారు. ఐతే స్మితా సబర్వాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏఐ ఫోటోను పోస్టు చేయడం సంచలనంగా మారింది. మార్చి 31న హాయ్ హైదరాబాద్ అనే ఎక్స్ హ్యాండిల్‌లో పోస్టు చేసిన గిబ్లీ ఫొటోను స్మితా సబర్వాల్ రీట్వీట్చేశారు. అది కంచ గచ్చిబౌలి భూముల్లో బుల్డోజర్ల ముందు నెమళ్లు, జింకలు ఉన్నట్లుగా సృష్టించిన మార్ఫింగ్ ఫొటో. ఈ వివాదంలో పోలీసులు కేసులు నమోదు చేయడం ప్రారంభించగానే పలువురు తమ అకౌంట్ల నుంచి ఆ మార్ఫింగ్ ఫొటోను తొలగించారు. కానీ స్మితా సబర్వాల్ మాత్రం తొలగించలేదు. దీంతో ఈ నెల12న గచ్చిబౌలి పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చారు. నిజానికి నోటీసులు జారీ అయ్యాక స్మితా సబర్వాల్ ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పెడ్తారని అంతా భావించారు. కానీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా ఈ నెల 17న ఆమె మరో మూడు రీట్వీట్లు చేశారు. అయితే చట్టం అందరికీ సమానమా? ఎంపిక చేసిన వారినే టార్గెట్ చేస్తున్నారా? అంటూ ఆమె ప్రశ్నించారు.
స్మితా సబర్వాల్ వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పాలనలోనే ఆమె ఈ విధంగా స్పందించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో స్మితా సబర్వార్ తొమ్మిదేళ్లు పని చేశారు. మరీ ముఖ్యంగా సీఎంవోలో నీటిపారుదల శాఖ వ్యవహరాలను ఆమె చూశారు. అప్పుడే కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరిగాయి. ఆ సందర్భంలో లక్షల చెట్లను కొట్టేశారు. ఈ అంశాన్ని అనేక జాతీయ పత్రికలు కవర్ చేశాయి. అయితే అప్పుడు వేల ఎలకరాల్లో చెట్లు తొలగిస్తే లేని స్పందన ఇప్పుడెందుకు వచ్చిందంటున్నారు.
గతంలో బీఆర్ఎస్ పాలనలో ఓ వెలుగువెలిగిన ఆమెపై అనేక విమర్శలు వచ్చాయి. రివ్యూలకు హెలికాప్టర్ లో వెళ్లడం కూడా విమర్శలపాలయ్యారు. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఆమెను కొన్నాళ్లు కొత్త ప్రభుత్వం పక్కన పెట్టింది. ఇప్పుడు టూరిజం శాఖలో పని చేస్తు్న్నారు. ఐతే ప్రభుత్వం మారితే...ఆ సర్కారు నిర్ణయాలకు అనుగుణంగా పని చేయాలని కానీ...అందుకు విరుద్దంగా ఆమె వ్వవహరిస్తున్నారు. ఐతే ప్రభుత్వం కూడా స్మితా సబర్వాల్ పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మీరు ప్రభుత్వ అధికారి. సర్కారు పాలసీని పాటించడం మీ పని. రాజకీయాలు చేయడం కాదు. గత ప్రభుత్వ అరాచకాలపై ఒక్కసారి అయినా మీరు మాట్లాడారా? అంటూ ఒకరు కామెంట్ చేశారు. ఈమె ఒక్కరే కాదు...తెలంగాణలో కొందరు ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడం లేదా? గత బీఆర్ఎస్ పాలనలో ఉన్న వెసులుబాటు, ఇష్టారాజ్యం వారికి కాంగ్రెస్ ప్రభుత్వంలో చెల్లుబాటు కావడం లేదా? అందుకే వారు ఈ సర్కారుకు అంతంత మాత్రంగానే సహకరిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోందంటున్నారు విశ్లేషకులు.