రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ నెంబర్ వన్ విలన్: కేసీఆర్

రజతోత్సవ సభ వేదిక నుంచి కేసీఆర్ ప్రసంగం

On

  • పహల్గామ్ దాడిలో మృతులకు నివాళి
  • పదేళ్ల పాటు ధగధగలాడే తెలంగాణను తయారు చేశాం: కేసీఆర్
  • చంద్రబాబు తెలంగాణ పదమే ఉపయోగించకూడదన్నారు: కేసీఆర్
  • నకిలీ గాంధీలంటూ ఘాటు విమర్శలు
  • మళ్లీ రాష్ట్రంలో 2014కి ముందు పరిస్థితులు
  • హెచ్‌సీయూ యూనివర్శిటీ భూములు అమ్ముతారా?
  • ఆపరేషన్ కగార్ ఆపేయాలి: కేసీఆర్
  • పోలీసులకు కేసీఆర్ వార్నింగ్

సాయి సూర్య బ్యూరో:  అవే పంచులు, అదే ఘాటుతనం, అదే మాటల మంత్రం ఏ మాత్రం తగ్గని పోరాట పటిమ, పడి లేచిన తెలంగాణ ఉద్యమాన్ని ఎలా పరుగులు పెట్టించారో..అలాగే బీఆర్ఎస్‌కు కొత్త జోష్ అందించారు. ఒకే ఒక్క సభతో అన్నిటికి సమాధానం చెప్పారు. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్నాడు, ఇక రాడు అనుకున్నారేమో...కానీ ఒక్కసారి వచ్చారంటే ఎలా ఉంటుందో చూపించారు.  బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగం మరోసారి యావత్ తెలుగు రాష్ట్రాలను టీవీలకు అతుక్కుపోయేలా చేసింది. 

1

హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి రజతోత్సవ సభ వేదిక మీదుగా (BRS) బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ ప్రస్తానం నుంచి నేటి వరకు సాగిన ప్రయాణాన్ని మరోసారి ప్రజల ముందు ఉంటారు. అందరికీ తెలిసిందే ఐనా...తమ ప్రయాణం ఎలా సాగిందో చెప్పి శ్రేణుల్లో భావోద్వేగాలను రేపారు. మరొక్కసారి జై తెలంగాణ, జై కేసీఆర్ అని భావోద్వేగంతో నినదించేలా చేశారు. అంతేకాదు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మంచిని, తీసుకున్న నిర్ణయాలను ప్రజల ముందు ఉంటారు. (KCR)ఇక రాష్ట్రంలో అధికార పార్టీ పాలనను ఎండగట్టారు. ఒక్కో అంశం ప్రస్తావిస్తూ అధికార పార్టీ నేతలను కడిగిపారేశారు. మధ్యమధ్యలో శ్రేణులు సీఎం...సీఎం అంటూ గోల చేస్తే...తనదైన స్టయిల్‌లో  వారించారు. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మరోమారు  విమర్శల దాడి ఎక్కుపెట్టారు. అంతేకాదు...పెహల్గామ్ ఉగ్రదాడిలో మృతులకు నివాళి అర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. దేశ్ కీ నేత అంటే ఎలా ఉండాలో...చెప్పకనే చెప్పారు. అలాగే ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా నిరసన గళం వినిపించారు. కేంద్ర ప్రభుత్వం కగార్ పేరుతో మావోయిస్టులను అక్రమంగా కాల్చివేయడంపై ప్రశ్నలు సంధించారు. శాంతితోనే సమాజం ముందుకు సాగుతుందని స్ఫష్టం చేశారు. అలాగే రాష్ట్రంలో పోలీసుల తీరుపై విమర్శలు గుప్పించారు. అన్ని పార్టీల నేతలలాగే...ఖబర్దార్ అంటూ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. ఇలా సాగిన కేసీఆర్ మాటల దాడి... మరోసారి తెలంగాణ ప్రజల చెవుల్లో మారుమ్రోగుతున్నాయి. ఏడాదిన్నరగా ఎదురుచూస్తున్నా వారికి ఫుల్ మీల్స్ గా అనిపించింది. 

WhatsApp Image 2025-04-23 at 16.42.56_d1f1a716

మొదట పహల్గామ్ దాడిలో మృతులకు నివాళి అర్పించి...ప్రసంగం ప్రారంభించిన కేసీఆర్...కాంగ్రెస్ పాలనను తూర్పురబట్టారు. తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ నెంబర్ వన్ విలన్ అని కేసీఆర్ విమర్శించారు. 1956, 1969 తెలంగాణను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ మొదటి విలన్ అన్నారు. 

6

తెలంగాణ రాష్ట్ర సమితి చరిత్ర
వలసవాదుల విషకౌగిలిలో చిక్కుకున్న తెలంగాణకు విముక్తిని కల్పించాలనే లక్ష్యంతో ఒక్కడినే బయలుదేరానన్నారు. పిడికిలి మందితో ప్రయాణం ప్రారంభించి పోరాడి తెలంగాణను సాధించానని చెప్పారు. ప్రజలు దీవిస్తే పదేళ్ల పాటు ధగధగలాడే తెలంగాణను తయారు చేశానన్నారు కేసీఆర్. 

చంద్రబాబుపై మరోసారి విమర్శలు   
సమైక్య పాలకుడిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డు తగిలిన  టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ద్రోహాలు,  దుష్ట చర్యలను ఉద్యమ నేత, మాజీ సీఎం కేసీఆర్ మర్చిపోలేదు. (CBN) (APCM)చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఏపీ శాసన సభలో తెలంగాణ పదమే ఉపయోగించకూడదని రూలింగ్ ఇచ్చారని గుర్తు చేసి విమర్శించారు. 

10

రాష్ట్రాన్ని అభివృద్ధిని చేశాం: కేసీఆర్
పదేళ్ల పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించామన్నారు కేసీఆర్. ప్రాజెక్టు నిర్మించి సాగుభూమిని పెంచామని చెప్పారు. మూడేళ్లలోనే కాళేశ్వరం నిర్మించామని చెప్పారు. రైతులకు ఆర్థిక సాయం కొరకు రైతుబంధు, రైతు బీమా అమలు చేశామన్నారు. మిషన్ భగీరథ వంటివి తమ హయాంలో చేపట్టిన అనేక కార్యక్రమాలు అభివృద్ధి చర్యలను చెప్పారు. 

6

  • కాంగ్రెస్‌పై విమర్శనాస్త్రాలు
     
    బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధిలో దేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న తెలంగాణకు నేడు ఏం బీమారి వచ్చిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల పాలనతో నేడు రాష్ట్ర పరిస్థితి దిగజారిందని  చెప్పారు. ఢిల్లీ నుంచి వచ్చిన నకిలీ గాంధీలంటూ ఘాటు విమర్శలు చేశారు. ప్రతి చెడు విషయానికి కేసీఆర్ కారణమని చెబుతున్నారని అన్నారు. తన కళ్ల ముందే తెలంగాణ ఇలా అయిపోతుంటే దు:ఖం వస్తోందన్నారు.  మళ్లీ కరెంటు కోతలు, మోటార్టు కాలిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. 2014కి ముందు పరిస్థితులు మళ్లీ రాష్ట్రంలో వచ్చాయన్నారు. 


ఇప్పటి నుంచి బయటికి వస్తా: కేసీఆర్
ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టికి సమయం ఇవ్వాలని బయటికి రాలేదన్నారు ఇప్పటి నుంచి బయటికి వస్తా అన్నారు కేసీఆర్. అందరి తరఫున పోరాడతానని ..ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి తెలివితో పని చేయాలన్నారు. 

యూనివర్శిటీ భూములు అమ్ముతారా? 
భూములు అమ్మొచ్చు అభివృద్ధి చేయొచ్చు కానీ ఏది అమ్మాలో విచక్షణ ఉండాలన్నారు కేసీఆర్. ఎక్కడైనా యూనవర్శిటీ భూములు అమ్ముతారా అని ప్రశ్నించారు. 

ఆపరేషన్ కగార్ ఆపేయాలి: కేసీఆర్
బీజేపీ పదకొండేళ్ల కాలంలో తెలంగాణకు 11 రూపాయలు ఇవ్వలేదని విమర్శించారు. అలాగే బీజేపీ వైఖరి అంతా భభ్రమానం, భజగోవిందం శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు అని విమర్శించారు. ఆపరేషన్ కగార్ పేరుతో గిరిజనులు, యువతను బలగాలు ఊచకోతను కోస్తున్నారని...చర్చలకు పిలవాలని మావోయిస్టులు కోరతున్నారన్నారు.   వారి వినతి మేరకు చర్చలు చేపట్టాలన్నారు. ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపివేయాలని...కోరారు. 

పోలీసులకు వార్నింగ్
తెలంగాణ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు కేసీఆర్. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసుల చర్యలను విమర్శించారు. పోలీసుల పేర్లను డైరీలో రాసుకుంటామన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు భయపడ వద్దన్నారు. వారికి అండగా ఉంటామన్నారు. 

 ✍️✍️అవినీతి పై అక్షరం తూట సాయి సూర్య 

Views: 35

Latest News