స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్‌డేట్

రాష్ట్ర కాంగ్రెస్ పరిశీలకుల సమావేశంలో దిశానిర్దేశం

On
స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్‌డేట్

మీనాక్షి నటరాజన్ సూచనలు
ఈ నెల 25 నుంచి 30వ తేదీ వరకు జిల్లా స్థాయి సమావేశాలు

పరిశీలకులకు మూడు దశల్లో టాస్క్‌లు

సాయి సూర్య తెలంగాణ బ్యూరో: లంగాణలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కోసం చర్యలు ప్రారంభించింది. ఈ 5ఏళ్లే కాదు రానున్న మరో 5ఏళ్లు అధికారంలో ఉండేందుకు వ్యూహాలను ఇప్పటి నుంచే సిద్ధం చేస్తోంది. రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామీణ స్థాయిలో కేడర్ మరింత బలంగా ఉండేలా, పార్టీ పటిష్టత కోసం ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్ గాంధీ భవన్ లో కీలక సమావేశం నిర్వహించి...పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. 


గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన రాష్ట్ర పరిశీలకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సహా కీలక నేతలు హాజరయ్యారు. ఈ మీటింగ్ లో కాంగ్రెస్ కార్యకర్తలు కీలక అప్ డేట్ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారా? అని గ్రామీణ స్థాయిలో కాంగ్రెస్ నేతలు ఎదురుచూస్తున్నారు. జనవరిలో నిర్వహిస్తారని అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఐతే తాజాగా దీనిపై తాజా సమావేశంలో చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో నిర్వహించనున్నట్టు తెలిపారు. అలాగే వార్డు సభ్యుల నుంచి జిల్లా పరిషత్ ఛైర్మన్ వరక, కౌన్సిలర్, మేయర్ పదవులతో కలిపి లక్ష వరకు భర్తి చేసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ సలహదారు, టీపీసీసీ నేత వేం నరేందర్ రెడ్డి అన్నారు. 

ఇక ఈ సమావేశంలో  పార్టీలో సంస్థాగత నిర్మాణంపై చర్చించారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని కార్యవర్గాల కూర్పు చేపట్టేందుకు రంగం సిద్ధం చేసింది. మూడు దశల్లో పరిశీలకులకు టాస్క్  నిర్దేశించింది. ఈ నెల 25 నుంచి 30వ తేదీ వరకు జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. జిల్లా స్థాయి సమావేశాలకు కింది స్థాయి నుంచి బ్లాక్, మండల అధ్యక్షులు, ఎంపీ, పీసీసీ ఆఫీస్ బేరర్లు, జిల్లా స్థాయి సీనియర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఏఐసీసీ నేతలను ఆహ్వానించాలని వివరించింది. టాస్క్ 2లో అసెంబ్లీ, బ్లాక్ లెవెల్ మిటింగ్స్ , టాస్క్ 3లో మండల సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పింది. 

మీనాక్షి నటరాజన్ సూచనలు

పార్టీలో నేతలకు ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దిశానిర్దేశం చేశారు. కలిసి కట్టుగా పనిచేసి మరోసారి అధికారంలోకి రావాలన్నారు. నేతలందరూ సమన్వయంతో పని చేయాలన్నారు. 

1528229-tpcc
జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ క్యాంపెయిన్ ను విజయవంతం చేయాలన్నారు. కోఆర్డినేటర్లు తమకు ఇచ్చిన బాధ్యతలను అత్యుత్తమంగా నిర్వహిస్తున్నారని ఈ సందర్భంగా ప్రశంసించారు. 

మొత్తం పరిశీలకుల సమావేశంలో  పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని సూచించారు 

Views: 205

Latest News