Silver Jubilee public meeting:సిల్వర్ జూబ్లీ బహిరంగ సభనువిజయవంతం చేయాలి :చెవుల దశరథ

On
Silver Jubilee public meeting:సిల్వర్ జూబ్లీ బహిరంగ సభనువిజయవంతం చేయాలి :చెవుల దశరథ
బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, తుర్కయంజాల్ మాజీ సర్పంచ్ చెవుల దశరథ

బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బహిరంగ సభకు తరలివచ్చి విజయవంతం చేయాలి

తుర్కయంజాల్ (సాయి సూర్య):వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, తుర్కయంజాల్ మాజీ సర్పంచ్ చెవుల దశరథ పిలుపునిచ్చారు.  శనివారం ఆయన మాట్లాడుతూ భారీ బహిరంగ సభలు నిర్వహించడంలో బీఆర్ఎస్ పార్టీని మించిన రాజకీయ పార్టీ లేదనన్నారు .సిల్వర్ జూబ్లీ బహిరంగ సభను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించేందుకు పార్టీ ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు.

686e5ebd-903a-4b4b-861f-de1b831506f9
బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ప్రసంగాన్ని వినేందుకు దేశంలోని రాజకీయ పార్టీల నాయకులు మేధావులు ప్రజలు ఎంతగానో ఆసక్తి కనబరుస్తున్నారని వెల్లడించారు. పార్టీలకతీతంగా ప్రజలు అభిమానులు బహిరంగ సభకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున బహిరంగ సభకు తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు

Views: 91

Latest News