ఏపీ నుంచి రాజ్యసభకు ఎవరు..?

మందకృష్ణ మాదిగకు రాజ్యసభ సీటు ఖాయం...!

On
ఏపీ నుంచి రాజ్యసభకు ఎవరు..?

విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన సీటు
ఏపీ నుంచి రాజ్యసభకు అన్నామలై..?
మళ్లీ విజయసాయిరెడ్డి రాజ్యసభకు వెళ్తారా..?

ఆంధ్రప్రదేశ్‌ నుంచి  ఖాళీ అయిన  రాజ్య‌సభ స్థానం ఎవరిని వరించనుంది. టీడీపీకి దక్కుతుందా? లేక జనసేకు ఇస్తారా? బీజేపీ తీసుకుంటుందా? గత కొన్ని  రోజులుగా ఈ అంశంపై చర్చ జరుగుతోంది. ఎవరికి ఇవ్వాలో ఇంకా క్లారిటీ రాలేదు. ఈ సీటు కేటాయింపులపై ఎవరెవరి పేర్లో వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న పేర్లే కాకుండా కొత్త వ్యక్తి పేరు కూడా తాజాగా వినిపిస్తోంది. ఎస్సీ వర్గీకరణకు పోరాటం చేసిన ఆ నాయకుడిని రాజ్యసభకు పంపాలనే ఆలోచన చేస్తోందట.

images (2)


ఏపీలో వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. ఆయన రాజీనామాతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. విజయసాయిరెడ్డి రాజ్యసభ స్థానానికే కాదు వైసీపీకి కూడా బై...బై చెప్పేశారు. ఈ విషయం పక్కనపెడితే... ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఆ స్థానంలో ఎవరిని ఎంపిక చేయాలా? అని సమాలోచనలు చేస్తున్నాయి అన్ని పార్టీలు. 

images (1)

అన్నామలైకి ఇస్తారాని ప్రచారం

తమిళనాడు బీజేపీ నేత అన్నామలైకి ఏపీ నుంచి బీజేపీ రాజ్యసభ సీటు ఇవ్వనుందని ప్రచారంలో ఉంది. అన్నామలై బీజేపీ అధ్యక్ష పదవి నుంచి ఈ మధ్యే తప్పుకున్నారు. దీంతో ఆయనను రాజ్య సభ నుంచి ఎంపీని చేసి...కేంద్ర మంత్రి పదవి కట్టబెడతారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. 

టీడీపీ నేతలకే రాజ్య సభ సీటు..!
టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉంది. టీడీపీలో ఇప్పటికే అనేక మంది క్యూలో ఉన్నారు. ఆ పార్టీ ఇప్పటికే తమకు రాజ్యసభ సీటు ఇవ్వాలని కోరుతోంది. ఇందుకోసం టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఢిల్లీలో బీజేపీ పెద్దలతో చర్చించినట్టు సమాచారం. దీంతో టీడీపీ  అభ్యర్థికి  సీటు ఇస్తారని అంటున్నారు. 

విజయసాయిరెడ్డికి మళ్లీ రాజ్యసభ సీటు..!
విజయసాయి రెడ్డినే మళ్లీ బీజేపీ రాజ్యసభకు పంపించనుందని..ప్రచారం ఊపందుకుంది. ఆయనను బీజేపీ నుంచి రాజ్యసభకు తీసుకొని కేంద్ర మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇదిలా ఉంటే ఈ ఊహాగానాలను అన్నిటిని మించి కొత్త తెరపైకి మరో పేరు వచ్చింది. 

GiJrBrCa4AE8ZF0

మందకృష్ణ మాదిగకు రాజ్యసభ సీటు..! 
ఎస్సీ వర్గీకరణకు ఎన్నో ఏళ్లుగా మందిగకృష్ణ మాదిగ పోరాటం చేశారు. ఎన్నికల సమయంలో ప్రధాని మోదీకి మందకృష్ణ మాదిగ ఎమ్మార్పిఎస్ సన్నిహితంగా ఉంది. ఎస్సీ వర్గీకరణపై కేంద్రం సానుకూలత వ్యక్తం చేయడం, సుప్రీంకోర్టు తీర్పు కూడా వర్గీకరణ అంశాన్ని తేల్చడంతో బీజేపీకి మరింత దగ్గరయ్యారు. దీంతో ఈసారి మందకృష్ణ మాదిగను ఏపీ నుంచి  రాజ్యసభకు పంపిస్తారని టాక్.  కొన్ని రోజుల క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మందకృష్ణ మాదిగను కలిశారు. అమిత్ షాను కలిసిన తర్వాత మందకృష్ణ మాదిగ ఢిల్లీలోని ముఖ్యమంత్రి నివాసానికి వచ్చి చంద్రబాబును కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దీంతో ఆయనకు రాజ్యసభ సీటు కన్ఫార్మ్ అని చర్చించుకుంటున్నారు. ఐతే అధికారికంగా ఎలాంటి నిర్ణయం ఇంకా తీసుకోలేదు. మరి వీరిలో ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి.   

Views: 5

Latest News