Rajagopal Reddy:కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి మొండి చెయ్యేనా?

Mal reddy ranga reddy :మల్ రెడ్డి రంగారెడ్డిని పదవి వరిస్తుందా?

On
Rajagopal Reddy:కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి మొండి చెయ్యేనా?
జానారెడ్డి లేఖ  ప్రభావం చూపిందా?

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశలు అడియాశలు.
మంత్రి పదవి లేనట్టేనా? 

మంత్రి పదవిపై ఆశలు నిరాశేనా?

రాహుల్ గాంధీ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చేందుకు సుముఖంగా లేరా?

ఇప్పటికే మంత్రి పదవుల లిస్ట్ తయారైందా? రాజగోపాల్ రెడ్డి వల్లే కేబినెట్ విస్తరణ ఆలస్యం అయిందా?

మరి ఆయన స్థానంలో రాహుల్ ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు.? 

రాజగోపాల్ రెడ్డిపై అసహనంగా రాహుల్ గాంధీ
మంత్రి పదవి ఇచ్చేందుకు వెనకడుతున్న హైకమాండ్ 
జానారెడ్డి లేఖ  ప్రభావం చూపిందా?

సాయిసూర్య, తెలంగాణ బ్యూరో:తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణ మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది. పదవులు ఎప్పుడు వర్తిస్తాయా అని ఆశావహుల ఎదురుచూపులు. పూర్తి స్థాయి ప్రభుత్వం కొలువుదీరుతుందని మరోవైపు చర్చలు. ఏడాదిన్నర దాటినా.. పూర్తిస్థాయి కేబినెట్ విస్తరణ జరగకపోవడం పార్టీకి కొంత నష్టం కలిగిస్తోంది. ఇదిలా ఉంటే పదవులపై ఆశలు పెట్టుకున్న నేతలు బహిరంగ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఐతే ఆరు బెర్తుల్లో ఎవరెవరికి చోటు ఇవ్వాలని ఇప్పటికే డిసైడ్ అయిందని తెలుస్తోంది. కానీ ఆలస్యం అవ్వడానికి.. పార్టీ కార్యక్రమాలతో పాటు..రాజగోపాల్ రెడ్డి కూడా కారణం అని చెప్తున్నారు. దీంతో ఆయన పై ఆశావహులు గుస్సాగా ఉన్నారట. 

రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు. ఆయనకు ఇస్తే.. తప్పుడు సంకేతాలు వెళతాయని భావిస్తున్నారట. ఒకే ఇంట్లో ఇద్దరికీ మంత్రి పదవుల అంశం, ఆయన దూకుడు స్వభావం, జానారెడ్డి లేఖ వంటివి కారణాలుగా తెలుస్తోంది. దీంతో ఆయన స్థానంలో మల్ రెడ్డి రంగారెడ్డికి చోటు ఇవ్వాలని భావిస్తున్నారట. ఆయనకు ఇస్తే.. పార్టీలో ఏ ఇబ్బంది ఉందని అంటున్నారట. ఇక వివేక్ కూడా మంత్రి పదవి ఇవ్వాలని డిసైడ్ అయిందట అధిష్టానం. వీరితో కలిపి మొత్తం నలుగురికి పదవులు వరిస్తాయనీ సమాచారం.rangareddy

మరి రాజా గోపాల్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారో అని ఆసక్తి నెలకొంది. ఎన్నో ఆశలతో ఉన్న ఆయన ఒకానొక సమయంలో హోమ్ మంత్రి పదవి చేపడతా అని వ్యాఖ్యలు చేశారు. కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని నమ్మారు. కానీ రాహుల్ షాక్ ఇస్తుండటంతో .. రాజగోపాల్ రెడ్డి డైలమాలో పడ్డారట. మరి ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంటో చూడాలి.

Views: 416

Latest News